ఆరుగురు సంతానం ఉంటే అనామలిస్ జాబితాలోనా?
ABN , Publish Date - Jun 14 , 2026 | 04:00 AM
ఆరుగురు సంతానం ఉంటే అనామలిస్(తేడాలు) జాబితాలో పెడతారా..? దీనికి ప్రామాణికం ఏమిటి? ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఇళ్లలోనూ ఆరుగురు ఉన్నారు...
మోదీ, యోగి ఇంట్లోనూ ఆరుగురు ఉన్నారు..
నా ఇంట్లో కూడా ఆరుగురు సంతానం అసదుద్దీన్
హైదరాబాద్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): ఆరుగురు సంతానం ఉంటే అనామలిస్(తేడాలు) జాబితాలో పెడతారా..? దీనికి ప్రామాణికం ఏమిటి? ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఇళ్లలోనూ ఆరుగురు ఉన్నారు... నా ఇంట్లో కూడా ఆరుగురు ఉన్నారు...? ఏ చట్ట ప్రకారం అనామలిస్ జాబితాలో పెట్టారు అని మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. శనివారం ఆయన చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్‌రెడ్డిని కలిసి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్)పై వినతిపత్రాన్ని అందించారు. గతంలో ఓటర్లుగా ఉన్నా పలు కారణాలతో పేర్లు తొలగిస్తే... వారి ఫామ్-6ను మొదటిసారి ఓటరు కాదనే కారణంతో తిరస్కరిస్తున్నారని, ఆ సందర్భంలో ఏం చేయాలని చీఫ్ ఎలక్టోరల్ అధికారిని ఆరా తీశారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.