పార్టీని కేసీఆర్ తన అధీనంలోకి తీసుకోవాలి
ABN , Publish Date - May 13 , 2026 | 04:32 AM
కేసీఆర్‌ను నేను కోరేదొకటే పార్టీని మీ చేతుల్లోకి తీసుకోండి. మీరు పార్టీని ఎవరి(కేటీఆర్ పేరెత్తకుండా) చేతుల్లో పెడుతున్నారో వారికి జ్ఞాపకశక్తి తక్కువ.
ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్, మే 12 (ఆంధ్రజ్యోతి): ‘కేసీఆర్‌ను నేను కోరేదొకటే పార్టీని మీ చేతుల్లోకి తీసుకోండి. మీరు పార్టీని ఎవరి(కేటీఆర్ పేరెత్తకుండా) చేతుల్లో పెడుతున్నారో వారికి జ్ఞాపకశక్తి తక్కువ. బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగా జూబ్లీహిల్స్‌లోని ప్రధాన ఆలయంలో ఒక చిన్నారిపై అత్యాచారం జరిగింది. ఆ కేసులో ఆలయ కమిటీ చైర్మన్ ఎవరు.. ఆ కేసులో మీరు చేసిందేంటి’ అని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ నిలదీశారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడి కేసులో మజ్లిస్ మౌనంగా ఉందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను విలేకర్లు ప్రస్తావించగా.. అసదుద్దీన్ ఒవైసీ పై విధంగా స్పందించారు. విమర్శలు చేసే ముందు బీఆర్‌ఎస్ హోం వర్క్ చేయాలని, కేసీఆర్ నేరుగా నియంత్రించకపోతే.. ఇలాంటి(కేటీఆర్) వ్యక్తుల చేతుల్లో పార్టీని పెడితే ఇబ్బందులు తప్పవన్నారు. బండి సంజయ్ కుమారుడి కేసు లో బాధిత యువతి వెంట నిలబడతామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నారు.