Share News

పల్లె నిధులపై నిఘా

ABN , Publish Date - Nov 19 , 2026 | 01:22 AM

గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధులు సక్రమంగా ఖర్చవుతున్నాయా? ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చించాల్సిన పైసలు పక్కదారి పడుతున్నాయా? గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు

పల్లె నిధులపై నిఘా

పెద్దపల్లి, నవంబరు18(ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధులు సక్రమంగా ఖర్చవుతున్నాయా? ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చించాల్సిన పైసలు పక్కదారి పడుతున్నాయా? గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన లెక్కలు సక్రమంగా ఉన్నాయా? ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలో జరుగుతున్న గ్రామపంచాయతీల వార్షిక ఆడిటింగ్‌ ఈ ప్రశ్నలను తెరపైకి తెస్తోంది. పంచాయతీల ఖాతాలు, ఖర్చుల వివరాలు, బిల్లులు, అభివృద్ధి పనుల రికార్డులను అధికారులు పరిశీలిస్తుండగా పలు అభ్యంతరాలు నమోద వుతున్నాయి. ఇప్పటివరకు ఆడిటింగ్‌ పూర్తయిన 52 గ్రామపంచా యతీల్లోనే 467 అభ్యంతరాలు గుర్తించడం చర్చనీయాంశంగా మారింది.

ఫ 267 పంచాయతీలు.. 52 చోట్ల పూర్తి

పెద్దపల్లి జిల్లాలో మొత్తం 267 గ్రామపంచాయతీలు ఉండగా, ఈ ఏడాది ఆడిటింగ్‌ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు కేవలం 52 గ్రామపంచాయతీల్లో మాత్రమే ఆడిటింగ్‌ పూర్తయింది. మరో 25 గ్రామపంచాయతీల్లో ఆడిట్‌ నిర్వహించాల్సి ఉంది. మిగిలిన పంచా యతీల్లోనూ ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. గత ఆర్థిక సంవ త్సరానికి సంబంధించిన ఆదాయ, వ్యయాల వివరాలు, ప్రభుత్వ నిధు ల వినియోగం, అభివృద్ధి పనులకు సంబంధించిన చెల్లింపులు, బిల్లు లు, రికార్డులను ఆడిట్‌ బృందాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.

ఫ గతేడాది వేల సంఖ్యలో అభ్యంతరాలు

గత ఏడాది నిర్వహించిన ఆడిటింగ్‌లో జిల్లాలోని గ్రామపంచాయతీలకు సంబంధించి దాదాపు 2,085 అభ్యంతరాలు వచ్చినట్లు అధికారులు వెల్లడించిన వివరాలను బట్టి తెలుస్తోంది. వీటిలో హైరిస్క్‌ మీడియం, లోరిస్క్‌ విభాగాల్లో అభ్యంతరాలు నమోద య్యాయి. కొన్ని చోట్ల ఖర్చులకు సంబంధించిన సరైన ఆధారాలు లేకపోవడం, రికార్డుల నిర్వహణలో లోపాలు, నిబంధనల ప్రకారం లెక్కలు చూపకపోవడం వంటి అంశాలు ఆడిట్‌ పరిశీలనలోకి వచ్చి నట్లు తెలుస్తోంది. గత ఏడాది అభ్యంతరాలపై తీసుకున్న చర్యలు, వాటిలో ఎన్ని పరిష్కారమయ్యాయి, ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నా యనే వివరాలు కూడా కీలకంగా మారాయి.

ఫ ఈ ఏడాది 467 అభ్యంతరాలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు ఆడిటింగ్‌ పూర్తయిన 52 గ్రామపంచాయతీల్లో 467 అభ్యంతరాలు నమోద య్యాయి. వీటిలో 66 హైరిస్క్‌ కేటగిరీకి, 125 మీడియం రిస్క్‌కు, 275 లోరిస్క్‌ కేటగిరీకి చెందినవిగా అధికారులు గుర్తించినట్లు సమాచారం. హైరిస్క్‌ విభాగంలో నమోదయ్యే అభ్యంతరాలను అధికారులు మరింత ప్రాధాన్యంతో పరిశీలించాల్సి ఉంటుంది. అయితే ఆడిట్‌లో అభ్యంతరం నమోదైనంత మాత్రాన నిధుల దుర్వినియోగం జరిగినట్లు నిర్ధారణకు రాలేము. సంబంధిత పంచాయతీ అధికారులు వివరణలు, ఆధారాలు సమర్పించిన తర్వాతే వాటి స్వభావం, తీవ్రతపై స్పష్టత వస్తుందని చెపుతున్నారు.

ఫ అభివృద్ధి పనుల ఖర్చులపై నిఘా

గ్రామపంచాయతీలకు వివిధ పథకాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదలవుతున్నాయి. వీటితో అంతర్గత రహదారులు, మురుగుకాల్వలు, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, వీధిదీపాలు, ఇతర మౌలిక సదుపాయాల పనులు చేపడుతున్నారు. ఈ పనులకు సంబంధించి అంచనాలు, పరిపాలన అనుమతులు, పనుల కొలతలు, బిల్లులు, చెల్లింపులు, వినియోగ ధ్రువీకరణ పత్రాలను ఆడిట్‌ అధికారులు పరిశీలిస్తున్నారు. కాగితాలపై చూపిన పనులు క్షేత్రస్థాయిలో జరిగాయా? చేసిన పనులకు తగ్గట్టుగానే బిల్లులు చెల్లించారా? నిధుల వినియోగంలో నిబంధనలు పాటించారా? అనే అంశాలు ఆడిటింగ్‌లో కీలకంగా మారాయి.

ఫ ఫిర్యాదులతో అధికారుల వద్దకు ప్రజలు

మరోవైపు జిల్లాలో గ్రామపంచాయతీల ఆడిటింగ్‌ కొనసాగుతున్న నేపథ్యంలో పలువురు గ్రామస్థులు తమ గ్రామాల్లో జరిగిన పనులు, నిధుల ఖర్చులపై అధికారుల దృష్టికి అంశాలను తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని పనులు పూర్తికాకుండానే బిల్లులు చెల్లించారనే ఆరోపణలు, నాణ్యతలేని పనులు, నిధుల వినియోగంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవన్నీ ఫిర్యాదులు, ఆరోపణల స్థాయిలోనే ఉండగా, వాటిపై విచారణ జరిపి వాస్తవాలను నిర్ధారించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

ఫ అభ్యంతరాల పరిష్కారమే అసలు పరీక్ష

ఆడిటింగ్‌ నిర్వహించి అభ్యంతరాలు నమోదు చేయడంతోనే అధికారుల బాధ్యత పూర్తికాదు. సంబంధిత పంచాయతీ కార్యదర్శులు, బాధ్యులు వాటికి సరైన వివరణలు, బిల్లులు, రికార్డులు సమర్పించాలి. ఆ అభ్యంతరాలను పరిష్కరించి, అవసరమైన చోట నష్టాన్ని నిర్ధారించి, ప్రభుత్వ నిధుల రికవరీకి చర్యలు చేపట్టాలి. తీవ్రమైన ఆర్థిక అవక తవకలు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకో వాల్సి ఉంటుంది. జిల్లాలో ఇప్పటివరకు నమోదైన అభ్యంతరాల్లో ఎన్ని పరిష్కారమయ్యాయి? ఎంత మేరకు నిధుల నష్టం జరిగినట్లు తేలింది? ఎంత మొత్తం రికవరీ చేశారు? అన్న వివరాలు వెల్లడైతేనే గ్రామపంచాయతీల ఆర్థిక నిర్వహణపై పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Nov 19 , 2026 | 01:22 AM