Share News

Special Buses: సంక్రాంతికి 5 వేలకు పైగా ప్రత్యేక బస్సులు

ABN , Publish Date - Jan 06 , 2026 | 01:54 AM

సంక్రాంతి పండుగకు హైదరాబాద్‌ నుంచి తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాలకు 5 వేలకు పైగా ప్రత్యేక బస్సులు నడిపేలా ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది...

Special Buses: సంక్రాంతికి 5 వేలకు పైగా ప్రత్యేక బస్సులు

హైదరాబాద్‌ సిటీ, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగకు హైదరాబాద్‌ నుంచి తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాలకు 5 వేలకు పైగా ప్రత్యేక బస్సులు నడిపేలా ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తెలంగాణలోని జిల్లాలకు మూడురోజుల్లో 2,500కు పైగా ఏపీకి 3 వేల వరకు స్పెషల్‌ బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో ప్రత్యేక బస్సుల వివరాలు ప్రకటిస్తామని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. జనవరి 9 శుక్రవారం నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక సర్వీసులు నడిపేలా ఆర్టీసీ బస్సులు సిద్ధం చేస్తోంది. ముందస్తు రిజర్వేషన్ల కోసం పెద్దసంఖ్యలో బస్సులను అందుబాటులోకి ఉంచుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Updated Date - Jan 06 , 2026 | 01:54 AM