Share News

ప్రొఫెసర్‌ మనోహర్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి

ABN , Publish Date - Jan 21 , 2026 | 04:59 AM

ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్‌ అసోసియేషన్‌ (ఔటా) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ బి. మనోహర్‌ సస్పెన్షన్‌ వ్యవహారం ఓయూలో దుమారం రేపుతోంది.

ప్రొఫెసర్‌ మనోహర్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి

  • ఓయూ అధ్యాపకుల డిమాండ్‌

  • సస్పెన్షన్‌ను ఎత్తివేయకుంటే తీవ్ర పరిణామాలు

  • ఎమ్మెల్సీ నవీన్‌

ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్‌ అసోసియేషన్‌ (ఔటా) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ బి. మనోహర్‌ సస్పెన్షన్‌ వ్యవహారం ఓయూలో దుమారం రేపుతోంది. మంగళవారం సైన్స్‌ కాలేజీలోని ప్రిన్సిపాల్‌ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహణకు రిజిస్ర్టార్‌ అనుమతి నిరాకరించడంతో ఔటా నేతృత్వం లో అధ్యాపకులు రోడ్డుపైనే సమావేశం నిర్వహించారు. ప్రొఫెసర్‌ పై విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని, విశ్వవిద్యాలయాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా నడపాలని డిమాండ్‌ చేశారు. అధ్యాపకుల హక్కుల పరిరక్షణ కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఔటా స్పష్టం చేసింది. కాగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మె ల్సీ నవీన్‌ మంగళవారం ఓయూకు వచ్చి ప్రొఫెసర్‌ మనోహర్‌ సస్పెన్షన్‌పై తీవ్రఆగ్రహం వ్యక్తం చేశా రు. ప్రొఫెసర్‌పై సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివే య కుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. గేటు వద్ద ప్రొఫెసర్‌ను అడ్డుకున్న సెక్యూరిటీతో క్షమాపణలు చెప్పించారు. ఈ వ్యవహారంపై మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరిలతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్న అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని మంత్రులు హామీ ఇచ్చినట్లు తెలిపారు. కాగా వీసీ, రిజిస్ర్టార్‌లు పారిపోయారన్న ఎమ్మెల్సీ నవీన్‌ ఆరోపణలు వాస్తవ విరుద్ధమని రిజిస్ర్టార్‌ జి.నరేష్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - Jan 21 , 2026 | 04:59 AM