kumaram bheem asifabad-బడిబాట ర్యాలీ నిర్వహించి.. అవగాహన కల్పించి
ABN , Publish Date - May 14 , 2026 | 10:50 PM
జిల్లా వ్యాప్తంగా గురువారం ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విద్యా వారోత్సవాలలో భాగంగా గురువారం పీఎం శ్రీ వాంకిడి జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు.
వాంకిడి, మే 14 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా గురువారం ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విద్యా వారోత్సవాలలో భాగంగా గురువారం పీఎం శ్రీ వాంకిడి జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి బడీడు పిల్లలను బడిలో చేర్పించే విధంగా చూడాలని ప్రధానోపాధ్యాయుడు నటరాజ్ కోరారు. అలాగే సమ్మర్ క్యాంపు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్ టౌన్, (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ మండలంలోని జీడిచేనులో బడిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం ప్రారంభించి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. జీడిచేను ఎంపీపీఎస్ పాఠశాలలో 12 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించారు. ఈ సందర్భంగా ఎంఈవో వాసాల ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రజా పాలన-ప్రగతిప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించామన్నారు. ఇంటింటికి తిరుగుతూ విద్యార్థులకు విద్య అవశ్యకతను వివరిస్తూ, ప్రభుత్వం కల్పించిన సదుపాయాలను, సౌకర్యాలను తెలిపామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజేందర్, ఉప సర్పంచ్ లావణ్య, హెచ్‌ఎం బాలక్రిష్ణ, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
దహెగాం. (ఆంధ్రజ్యోతి): బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించాలని ప్రధానోపాధ్యాయుడు కిషన్‌రావు అన్నారు. మండల కేంద్రంలో బడి బాట కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జయలక్ష్మి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
జైనూర్, (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అదించేందుకు సర్కార్ ప్రత్యేక కృషి చేస్తున్నట్లు జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్‌రావ్ అన్నారు. మండలంలోని పోచంలొద్ది కేజీబీవీ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్ మడావి మనోహర్, డీసీసీ సభ్యుడు పెందుర్ ప్రకాష్, మాజీ వైస్ ఎంపీపీ ప్రకాష్, నాయకులు మేస్రాం అంబాజీరావ్, మాస్రాం శంకర్, ఆత్రం సుదర్శన్, ప్రత్యేక అధికారి సుమలత పాల్గొన్నారు.
బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): బడి బయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని బెజ్జూరు ఎంఈవో డాక్టర్ సునీత అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీఆర్పీ శ్రీనివాస్, ఉపాధ్యాయులు ముకుందరావు, సంతోష్, నర్మద, విజయ తదితరులు పాల్గొన్నారు.
సిర్పూర్(టి), (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విద్యా వారోత్సవాలలో బాగంగా గురువారం పీఎం శ్రీ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి బడీడు పిల్లలను బడిలో చేర్పించే విధంగా చూడాలని ప్రధానోపాధ్యా యుడు కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ నాగమణి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
కెరమెరి (ఆంధ్రజ్యోతి): బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించాలని మండలంలోని ఝరి గ్రామంలో బడి బాట కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కౌటాల (ఆంధ్రజ్యోతి): ం మండలంలోని గుండాయిపేట గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లితండ్రులకు తమ పిల్లలను బడికి పంపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈవో నానాజీ, ప్రధానోపాఽ ద్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.