kumaram bheem asifabad- సేంద్రియ, జీవన ఎరువులే మేలు
ABN , Publish Date - Jul 11 , 2026 | 10:49 PM
భూమి లో పోషకాల లోపం ఉంటే భర్తీకి రసాయనిక ఎరువులు విచ్చలవిడిగా వాడుతున్నారు. ముఖ్యంగా సన్న, చిన్నకారు రైతులు పంటలు పండించేటప్పుడు కొన్ని పోషకాలు అధికంగా ఇవ్వడం, మరికొన్ని తక్కువగా ఇవ్వడం వల్ల పోషక సమతుల్యత లేక పంటల ఉత్పాదకత తగ్గిపోతోంది. పోషకాలను రసాయనిక ఎరు వుల రూపంలో అవసరానికి మించి వాడడం తో భూ భౌతిక లక్షణాలు మారిపోయి సాగుకు పనికి రాకుండా పోతున్నాయి. ఈ పరిస్థితుల్లో భూములు ఎక్కువ కాలం సాగుకు పనికి వచ్చేలా ఉండాలంటే రైతులు రసాయన ఎరువులను తగ్గించాలని, సేంద్రి య, జీవన ఎరువులను వాడాలని వ్యవసా యాధికారులు సూచిస్తున్నారు.
- నేల సారాన్ని కాపాడితేనే దిగుబడులు
జైనూర్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): భూమి లో పోషకాల లోపం ఉంటే భర్తీకి రసాయనిక ఎరువులు విచ్చలవిడిగా వాడుతున్నారు. ముఖ్యంగా సన్న, చిన్నకారు రైతులు పంటలు పండించేటప్పుడు కొన్ని పోషకాలు అధికంగా ఇవ్వడం, మరికొన్ని తక్కువగా ఇవ్వడం వల్ల పోషక సమతుల్యత లేక పంటల ఉత్పాదకత తగ్గిపోతోంది. పోషకాలను రసాయనిక ఎరు వుల రూపంలో అవసరానికి మించి వాడడం తో భూ భౌతిక లక్షణాలు మారిపోయి సాగుకు పనికి రాకుండా పోతున్నాయి. ఈ పరిస్థితుల్లో భూములు ఎక్కువ కాలం సాగుకు పనికి వచ్చేలా ఉండాలంటే రైతులు రసాయన ఎరువులను తగ్గించాలని, సేంద్రి య, జీవన ఎరువులను వాడాలని వ్యవసా యాధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో వానకాలం సాగు ఊపందుకున్న నేపథ్యంలో రైతులు సేంద్రియ ఎరవులతో పాటు జీవన ఎరవులను సైతం వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. భూ సారం క్షీణించడం, సాగు వ్యయం పెరగడం వంటి సమస్యలకు సేంద్రియ సాగు ఉత్తమ ప్రత్యామ్నాయమని అధికారులు చెబుతున్నా రు. దీంతో జిల్లా వ్యాప్తంగా రైతుల్లో ఆవగాహన కల్పించేందుకు ఇది వరకు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
- జిల్లా వ్యాప్తంగా..
జిల్లాలో వరి, పత్తి, సోయాబీన్, మొక్క జొన్న, కందులు, పెసర్లు, మినుములు, బబ్బ ర్లు తదితర పంటలు విస్తృతంగా సాగవుతు న్నాయి. కొన్నేళ్లుగా రసాయన ఎరవుల వాడకం అధికమవ్వడంతో నేలలోని సహజ సూక్ష్మజీవులు తగ్గి భూ సారం దెబ్బ తిం టుంది. ఫలితంగా దిగుబడులు తగ్గడం, ఎరవులపై రైతుల ఖర్చు పెరగడం వంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో జీవన ఎరవులు (బయోఫర్టిలైజర్లు) రైతులకు ఎంతో ఉపయోగపడతాయని వ్యవసాయశాఖ నిప ుణులు చెబుతున్నారు. ఇక్కడ జీవన ఎరు వులు అంటే మొక్కలకు అందుబాటులోకి తెచ్చె లాభదాయకమైన సూక్ష్మజీవులతో తయారు చేసిన ఎరువులు. నేలలో నత్రజని స్ఠిరీకరణ, భాస్వరం కరగించడం, వేర్ల ఎదగుదలను ప్రోత్సహించడం ద్వార పంటల అభివృద్ధికి తోడ్పడుతాయి. ఫలితంగా రసాయన ఎరవుల అవసరం తగ్గడంతో పా టు భూ సారం సైతం దెబ్బతినకుండా ఉం టుందని చెబుతున్నారు. పశువుల ఎరవు, వర్మీ కంపోస్ట్, వంటి సేంద్రియ ఎరవుల వాడ కం వల్ల నేలలో సేంద్రియ కార్బన్ పెరిగి తేమ నిల్వ ఉండే సామర్థ్యం మెరుగుపడు తుందని అధికారులు సూచిస్తున్నారు. సేంద్రియ, జీవన ఎరవులను సమతుల్యంగా వాడినట్లయితే నేలలో వృధ్ధి చెందే ఖనీజ లవణాలతో అధిక దిగుబడులు సాధించ వచ్చని అధికారులు చెబుతున్నారు. కుమరం భీం జిల్లా గిరిజన ప్రాంతం కావడంతో ఇక్కడి రైతులు ఏటా వర్షాధారంపైనే ఆధార పడి పంటలు సాగు చేస్తున్నారు. ఇలాంటి ప్రాంతాల్లో నేల సారాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరమని, సేంద్రియ, జీవన ఎరు వులకు ప్రాధాన్యం ఇవ్వాలని వ్యవసాయ శా ఖ చెబుతోంది. ఇందులో భాగంగా జిల్లాలోని రైతులకు వ్యవసాయశాఖ విస్తీర్ణ అధికారులు సేంద్రియ, జీవన ఎరవులపై ఆవగాహన కల్పిస్తూ, పంటలకు అనుగుణంగా వాటి వినియోగ పద్ధతులను వివరిస్తున్నారు. నాణ్య మైన జీవన సేంద్రియ ఎరవులను వాడడం మూలంగా భూ సారం పెరగడమే కాకుండా రైతులకు సాగు ఖర్చు లు తగ్గి, దిగుబడులు సాధించే ఆవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
రైతులకు అవగాహన కల్పిస్తున్నాం..
- జాడి వెంకటి, జిల్లా వ్యవసాయ అధికారి
వానాకాలం పంట పనులు ప్రారంభం నుంచి ఏవోలు, ఏఈవోలు కలిసి నేరుగా వ్యసాయ క్షేత్రాల్లోకి వెళ్లి రైతులకు సేంద్రియ, జీవన ఎరవుల వాడకం, వాటి వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. రసాయన ఎరువుల వాడకం క్రమంగా తగ్గిం చాలని సూచించారు.