వోపీఎస్ అమలు చేయాలి
ABN , Publish Date - Sep 01 , 2026 | 11:12 PM
సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయా లని టీజీఈజేఏసీ నాయకులు డిమాండ్ చేశా రు. సెప్టెంబరు 1 పెన్షన్ విద్రోహ దినం పాటి స్తూ జిల్లాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎం పీడీవో, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
- టీజీఈజేఏసీ నాయకులు
కందనూలు/ కొల్లాపూర్/ అచ్చంపేటటౌన్/ కల్వకుర్తి/ తిమ్మాజిపేట/ వెల్దండ/ బిజినేపల్లి/ లింగాల, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయా లని టీజీఈజేఏసీ నాయకులు డిమాండ్ చేశా రు. సెప్టెంబరు 1 పెన్షన్ విద్రోహ దినం పాటి స్తూ జిల్లాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎం పీడీవో, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
సోమవారం నాగర్‌కర్నూల్ ఎంపీడీవో ఆఫీస్ ముందు పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా సీ పీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయా లని నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన నిర్వహిం చారు. కార్యక్రమంలో కార్యాలయ సూపరింటెం డెంట్ విశ్వేశ్వర్‌రెడ్డి, సీనియర్ అసిస్టెంట్, సిబ్బం ది పాల్గొన్నారు.
హైదరాబాద్‌కు తరలిన నాయకులు
హైదరాబాద్‌లో తలపెట్టిన మహాధర్నా కార్య క్రమానికి కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి సం ఘం నాయకులు, ఉపాధ్యాయులు భారీ సంఖ్య లో తరలివెళ్లారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రరావు, నాయ కులు రంగినేని కృష్ణ, శ్రీకాంత్, చంద్రారెడ్డి, ఈశ్వ రయ్య, వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.
అచ్చంపేటలో సీపీఎస్ ఉద్యోగ సంఘం రాష్ట్ర కార్యదర్శి గోపాల్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టా రు. పాత పెన్షన్ సాధన కోసం పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆర్డీ వో కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తూ ఆర్డీవో యాదగిరికి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయులు కృష్ణ, శంకర్, శ్రీధర్ రావు, హనుమంతు, మోతిరామ్, బాబురావు, సూర్య పాల్గొన్నారు.
కల్వకుర్తిలో టీజీఈజేఏసీ కల్వకుర్తి డివిజన్ చైర్మన్ ఎన్నచెర్ల సురేష్‌గౌడ్ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరిం చాలని డిమాండ్ చేశారు. నాయకులు, ఉద్యో గులు పాల్గొన్నారు.
తిమ్మాజిపేటలో తెలంగాణ ఎంప్లాయీస్ జా యింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు మండ లంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమస్య లు పరిష్కరించాలని కోరుతూ భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. గొరిట జడ్పీహెచ్‌ఎస్ ఆవరణలో నిరసన తెలి పిన పీఆర్‌టీయూ తెలంగాణ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డి, నాయకులు జైపాల్‌రెడ్డి, అశోక్, శేఖర్, శివరామకృష్ణ, సుధాకర్, శ్వేత పాల్గొన్నారు.
వెల్దండలో తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల ఎదుటు ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ కార్తీక్‌కుమార్, ఎంపీడీవో సులోచన, డీటీ మహ్మద్‌అలీ, సూపరిండెంట్ మోహన్‌లాల్ ఉన్నారు.
బిజినేపల్లిలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి మంగళ వారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేశారు.
లింగాలలో సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కోశాధికారి సనాతన బాలస్వామి ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. తహసీల్దార్, ఎంపీడీవో, ఎస్టీ హాస్టల్ ఎదుట భోజన విరామ సమయంలో ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్, కాం ట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొని ప్రభు త్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.