Share News

అబద్ధాలకు కేరాఫ్‌ కేటీఆర్‌, హరీశ్‌రావు

ABN , Publish Date - May 04 , 2026 | 04:38 AM

బీఆర్‌ఎస్‌ నేతలు ఉనికిని కాపాడుకునేందుకు పస లేని విమర్శలు చేస్తున్నారని, అబద్ధాలకు కేరాఫ్‌ అడ్ర్‌సగా కేటీఆర్‌, హరీశ్‌రావులే నిలుస్తారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ దుయ్యబట్టారు..

అబద్ధాలకు కేరాఫ్‌ కేటీఆర్‌, హరీశ్‌రావు

  • రైతులను రెచ్చగొట్టి రాజకీయమా?: విప్‌లు ఆది, బీర్ల

హైదరాబాద్‌, మే 3 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ నేతలు ఉనికిని కాపాడుకునేందుకు పస లేని విమర్శలు చేస్తున్నారని, అబద్ధాలకు కేరాఫ్‌ అడ్ర్‌సగా కేటీఆర్‌, హరీశ్‌రావులే నిలుస్తారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ దుయ్యబట్టారు. ఆదివారం సీఎల్పీ మీడియా సెంటర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని ప్రకటించి.. అధికారంలోకి వచ్చాక నోటిఫికేషన్లు ఇవ్వలేదని, ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించలేదని, పరీక్షలు పెట్టిన వాటి పేపర్లు లీక్‌ చేశారన్నారు. అధికారం పోయిన తర్వాత బీఆర్‌ఎస్‌ నేతలు నిరుద్యోగులపై కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చాక 70 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిందన్నారు. ప్రజల ఆశీర్వాదం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్‌ పార్టీకే ఉందని.. బీఆర్‌ఎ్‌సకు వచ్చే ఎన్నికల్లో ఓటేయటానికి ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు. రైతులను రెచ్చగొట్టి హరీశ్‌రావు రాజకీయాలు చేస్తున్నారని ప్రభు త్వ విప్‌ బీర్ల ఐలయ్య ధ్వజమెత్తారు. ఆరడుగులు హరీశ్‌కు మెదడు మోకాలులోకి వచ్చిందన్నారు. అధికారం కోల్పోయిన అక్కసుతో రైతులను కలుపుకొని దొంగ ధర్నాలకు దిగుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఇప్పటికే 8 వేల పైచిలుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని చెప్పారు.

Updated Date - May 04 , 2026 | 04:38 AM