Share News

అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాల విమర్శలు

ABN , Publish Date - Apr 30 , 2026 | 11:45 PM

అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. హాజీపూర్‌ మండలం గుడిపేట ఎల్లంపల్లి ప్రాజె క్టు వద్ద 85.10ఎకరాల్లో ఇంటర్నేషనల్‌ ఫిష్‌ పాండ్‌ పనులకు వర్షాకాలంలో ప్రారంభిస్తామన్నారు.

అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాల విమర్శలు

ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు

మంచిర్యాలక్రైం, ఏప్రిల్‌30 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. హాజీపూర్‌ మండలం గుడిపేట ఎల్లంపల్లి ప్రాజె క్టు వద్ద 85.10ఎకరాల్లో ఇంటర్నేషనల్‌ ఫిష్‌ పాండ్‌ పనులకు వర్షాకాలంలో ప్రారంభిస్తామన్నారు. గురువారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన వి లేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రధాన మంత్రి మత్స్య సంప ద యోజన(పీఎంఎస్‌వై) కింద ఎల్లంపల్లి జలాశయ పరిసరాల్లో మత్స్య పరిశ్రమ అభివృద్ధి సమీకృత అక్వాపార్కు కోసం నిధులు కేటాయించారని దీనికి సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, మత్స్యశాఖ మంత్రి శ్రీహరికి, సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఫిష్‌పాండ్‌తో కొర్రమొట్టల పెంపకంతో పాటు చేప పిల్లల పెంపక కేంద్రం తో స్థానిక మత్స్యకారులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు. ఇక్క డి నుంచి రాష్ట్రంలో అన్ని చెరువులకు చేప పిల్లల పంపిణీ జరిగిందని దే శంలోనే పెద్ద ఫిష్‌మార్ట్‌గా గుర్తింపు పొందుతుందన్నారు. ప్రతిపక్ష నా య కులు తాను చేసిన అభివృద్దికి ఓర్వలేకనే విమర్శలకు దిగుతున్నారని బీజే పీ, బీఆర్‌ఎస్‌ రెండు ఒక్కటేనన్నారు. చేసిన అభివృద్దిని కల్లు తెరిచి చూ డాలని గ్రామ పంచాయతీ, కార్పొరేషన్‌ ఎన్నికల్లో అభివృద్దికి పట్టం కట్టా రని అన్నారు. 70 కోట్లతో గూడెం ఆలయ అభివృద్ధికి కృషి చేసి అన్నవ రం దేవస్థానంలా తీర్చిదిద్దుతామన్నారు. ఇతర పుష్కరాల సమయం వర కు విశ్వనాథ ఆలయానికి పది కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు చేస్తామ న్నారు. ఈ సమావేశంలో మేయర్‌ ధర్ని మధూకర్‌, డిప్యూటి మేయర్‌ సల్ల రమ్య, కార్పొరేటర్లు తూముల నరేశ్‌, పెంట రజిత, కార్పొరేటర్లు, సుధ మల్ల హరిక్రిష్ణ నాయకులు పాల్గొన్నారు

Updated Date - Apr 30 , 2026 | 11:45 PM