Share News

22ఏ జీవోపై ప్రతి పక్షాలు అబద్దపు ప్రచారం..

ABN , Publish Date - Sep 05 , 2026 | 11:56 PM

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 22ఏపై ప్రతి పక్షాలు అబద్దపు ప్రచారం చేస్తున్నాయని, దీని వలన ఏ వరికీ నష్టం కలుగకుండా తానే బాధ్యత వహిస్తానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్‌ రావు హామీ ఇచ్చారు.

22ఏ జీవోపై ప్రతి పక్షాలు అబద్దపు ప్రచారం..
నస్పూర్‌లో మోటర్‌ సైకిల్‌ ర్యాలీలో ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్‌ రావు

ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు

మంచిర్యాలలో మోటర్‌ సైకిల్‌ ర్యాలీ

నస్పూర్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 22ఏపై ప్రతి పక్షాలు అబద్దపు ప్రచారం చేస్తున్నాయని, దీని వలన ఏ వరికీ నష్టం కలుగకుండా తానే బాధ్యత వహిస్తానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్‌ రావు హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం ఆయన నివాసం నుంచి నస్పూర్‌లోని సీసీసీ కార్నర్‌ వరకు మోటర్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. సీసీసీ కార్నర్‌ రా జీవ్‌ చౌరస్తా వద్ద ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మొట్ట మొ దటి సారిగా రాష్ట్రంలోనే సింగరేణి రిటైర్మెంట్‌ కార్మికులకు తెల్ల రేషన్‌ కార్డుల ను ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికే దక్కిందన్నారు. అంతే కాకుండా అనేక సంక్షేమ పథకాలను అందించిన ఘనత కూడా ఉందన్నారు. ఓసీ నిర్వాసితుల సమస్యలను తొందరగానే పరిష్కారం చేస్తానన్నారు. తాళ్లపల్లి, సింగపూర్‌, న స్పూర్‌ ప్రాంతాల్లో ఉన్న నిర్వాసితులకు 150 నుంచి 200 ఉద్యోగాలను అక్టోబరు చివరి నాటికి ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నాలు చేస్తానన్నారు. అందుకు సంబం ధించిన జాబితాను తయారు చేసి ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనను యాజమాన్యం అసం పూర్తిగా వదిలి వేసిందన్నారు. యాజమాన్యంతో మాట్లాడి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేపిస్తా నన్నారు. ఓసీ ముంపు బాదితులకు పూర్తి నష్ట పరిహారంతో పాటు ఇంకా వారి కి చెల్లించాల్సిన పరిహారం తొందరగానే అందే విధంగా కృషి చేస్తానన్నారు. సిం గరేణి స్థలాల్లో ఇంకా ఇంటి పట్టాలు రాని వారికి తొందరగానే పట్టాలను ఇప్పి స్తానని ఏమ్మెల్యే హామీ ఇచ్చారు. నియోజక వర్గం పరిధిలో బీఆర్‌ఎస్‌, బీజేపీ ఇతర పార్టీలు లేదని, కేవలం కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే ఉందన్నారు. గంజాయి నిర్మూలనకు పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచించారు. మంచిర్యాల ఏసీపీ ప్రకాష్‌ ఆధ్వర్యంలో భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశా రు. ఈ సైకిల్‌ ర్యాలీలో మేయర్‌ ధర్ని మధుకర్‌, డిప్యూటి మేయర్‌ సల్లా రమ్య, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, నగర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు తూముల నరేష్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రామగిరి బానేష్‌, వైస్‌ చైర్మన్‌ జాల లింగయ్య, నస్పూర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జీ నూకల రమేష్‌, సింగిల్‌ విండో వైస్‌ చైర్మన్‌ సీపతి మల్లేష్‌, లతో పాటు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్పోరేటర్లు, అనుబంధ సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2026 | 11:56 PM