అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Mar 10 , 2026 | 12:29 AM
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పనకు ఆలేరు పట్టణంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)లో ప్రవేశపెట్టిన షార్ట్‌టర్మ్ కోర్సు ప్రవేశాలను సద్వినియోగం చేసుకొని ఉద్యోగ అవకాశాలు పొందాలని మహిళా కార్పొరేషన్ రాష్ట్ర చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి, టీపీసీసీ ప్రఽధాన కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి కోరారు.
ఆలేరు, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పనకు ఆలేరు పట్టణంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)లో ప్రవేశపెట్టిన షార్ట్‌టర్మ్ కోర్సు ప్రవేశాలను సద్వినియోగం చేసుకొని ఉద్యోగ అవకాశాలు పొందాలని మహిళా కార్పొరేషన్ రాష్ట్ర చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి, టీపీసీసీ ప్రఽధాన కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి కోరారు. సోమవారం ఏటీసీలో 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఉచిత ప్రవేశాల కరపత్రం విడుదల చేసి మాట్లాడారు. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సహాయ సహకారాలతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌కు నూతన భవనం ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పనకు శిక్షణ కోర్సులు ఏర్పాటు చేశారని, ఈ అవకాశాన్ని పది ఉత్తీర్ణులైన నిరుద్యోగులందరూ షార్ట్‌టర్మ్ కోర్సుల్లో శిక్షణ పొంది ఉద్యోగ అవకాశాలు పొందాలన్నారు. యువతలో శిక్షణ నైపుణ్యాలను అద్భుత ఉపాధి అవకాశాలను పెంపొందించడం కోసం యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు ఐటీఐలో ఈసెంటర్ ఏర్పాటు చేసిందని తెలిపారు. కేవలం రెండు వారాలు మాత్రమే శిక్షణ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్‌పర్సన్ బీజని బాలమణి భాస్కర్‌తో పాటు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ బి. హరికృష్ణ, పలువురు కళాశాల అధ్యాపకులు, ఉద్యోగులు, సిబ్బంది, పాల్గొన్నారు.