కష్టపడే ప్రతీ కార్యకర్తకు అవకాశాలు వస్తాయి
ABN , Publish Date - Jan 24 , 2026 | 11:09 PM
పార్టీ కోసం కష్ట పడే ప్రతీ కార్యకర్తకు అవకాశా లువస్తాయని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు.
- ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
అచ్చంపేటటౌన్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి) : పార్టీ కోసం కష్ట పడే ప్రతీ కార్యకర్తకు అవకాశా లువస్తాయని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. శనివారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ ముఖ్యనాయకుల సమా వేశం నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో ఆయనతో యూత్ కాంగ్రె స్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచర ణ్ రెడ్డి, పాల్గొని మాట్లాడారు. రాబోయే రోజు ల్లో యూత్ కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్‌కు 50శాతం సీట్లు ఇచ్చారని తెలిపారు. యువతకు కాంగ్రెస్ ప్రజాపాలనలో పెద్ద పీటవేస్తామన్నారు. గ్రామ, మండల స్థాయిలో యూత్ కాంగ్రెస్ కమిటీలు ఏర్పాటు చేసి బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.