Share News

చమురు ఉత్పత్తిని పెంచాలని ఒపెక్‌ ప్లస్‌ నిర్ణయం

ABN , Publish Date - May 04 , 2026 | 04:02 AM

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు, హోర్ముజ్‌పై ఇరాన్‌ కఠిన ఆంక్షల నేపథ్యంలో చమురును ఉత్పత్తి చేసే ఒపెక్‌ ప్లస్‌ (ఓపీఈసీ+) దేశాల ...

చమురు ఉత్పత్తిని పెంచాలని ఒపెక్‌ ప్లస్‌ నిర్ణయం

వియన్నా, మే 3: పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు, హోర్ముజ్‌పై ఇరాన్‌ కఠిన ఆంక్షల నేపథ్యంలో చమురును ఉత్పత్తి చేసే ఒపెక్‌ ప్లస్‌ (ఓపీఈసీ+) దేశాల కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలను నియంత్రించేందుకు జూన్‌ నుంచి రోజుకు సుమారు 1.88 లక్షల బ్యారెళ్ల మేర అదనపు ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించింది. ఒపెక్‌ ప్లస్‌ దేశాల కూటమిలోని సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్‌, అల్జీరియా, కజకిస్థాన్‌, కువైట్‌ ఒమన్‌ దేశాలు ఆదివారం వర్చువల్‌గా సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించడం వరుసగా ఇది మూడో నెల కావడం గమనార్హం.

Updated Date - May 04 , 2026 | 04:02 AM