ఊర్కొండను కల్వకుర్తి డివిజన్‌లోనే ఉంచాలి
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:03 PM
ఊర్కొండ మండలాన్ని కల్వకుర్తి డివి జన్‌లోనే ఉంచాలని జేఏసీ మండల నా యకులు డిమాండ్ చేశారు.
ఊర్కొండ, జనవరి 10 (ఆంధ్రజ్యోతి) : ఊర్కొండ మండలాన్ని కల్వకుర్తి డివి జన్‌లోనే ఉంచాలని జేఏసీ మండల నా యకులు డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలోని కల్వకుర్తి-జడ్చర్ల ప్ర ధాన రహదారి వద్ద రిలే దీక్షలు ప్రారం భించారు. జేఏసీ నాయకులు మాట్లాడు తూ ఎమ్మెల్యే నూతనంగా ఏర్పాటు కా నున్న జడ్చర్ల రెవెన్యూ డివిజన్‌లో కలు పుతామంటూ ప్రకటన చేయడం సమంజసం కాదని అన్నారు. కల్వకుర్తి డివిజన్‌లో ఉండట మే మండల ప్రజలకు సౌకర్యవంతంగా ఉం టుందని తెలిపారు. దీక్షలో జేఏసీ నాయకులు నిరంజన్‌గౌడ్, రాజేందర్‌గౌడ్, మ్యాకల శ్రీనివా సులు, వీరస్వామి, శ్యాంసుందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, నరేందర్‌గౌడ్, కానుగుల జంగయ్య, తాడెం చిన్నా, రాములు, జంగయ్య, గోపి ఉన్నారు.