kumaram bheem asifabad-అర్హులకే ‘చేయూత’
ABN , Publish Date - May 20 , 2026 | 10:13 PM
సజీవం గా ఉంటేనే చేయూత పింఛన్ పొందే వీలు ఉంటుం ది. చేయూత పింఛన్ లబ్ధిదారుల్లో మృతిచెం దిన వారి పేర్ల తొలగింపునకు కార్యాచరణ మొదలైంది. సజీవ నిర్ధారణ సర్వే ద్వారా లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియకు ప్రభుత్వ స్వీకారం చుట్టింది. ఇది జూన్ 15 వరకు సర్వే చేపట్టనున్నారు. చేయూత పథకం కింద మృతి చెందిన వారి పేరిట బ్యాంకు ఖాతాలో జమ అయ్యే పింఛన్ డబ్బులను చాలాచోట్ల కుటుంబ సభ్యులు తీసుకుంటున్న దాఖాలాలున్నాయి. అలాంటి వాటిని తొలగించే ఉద్దేశంతో ప్రభుత్వం లబ్ధిదారులకు సంబంధించి సజీవ నిర్ధారణ సర్వే చేపడుతోంది
ఆసిఫాబాద్‌రూరల్, మే 20 (ఆంధ్రజ్యోతి): సజీవం గా ఉంటేనే చేయూత పింఛన్ పొందే వీలు ఉంటుం ది. చేయూత పింఛన్ లబ్ధిదారుల్లో మృతిచెం దిన వారి పేర్ల తొలగింపునకు కార్యాచరణ మొదలైంది. సజీవ నిర్ధారణ సర్వే ద్వారా లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియకు ప్రభుత్వ స్వీకారం చుట్టింది. ఇది జూన్ 15 వరకు సర్వే చేపట్టనున్నారు. చేయూత పథకం కింద మృతి చెందిన వారి పేరిట బ్యాంకు ఖాతాలో జమ అయ్యే పింఛన్ డబ్బులను చాలాచోట్ల కుటుంబ సభ్యులు తీసుకుంటున్న దాఖాలాలున్నాయి. అలాంటి వాటిని తొలగించే ఉద్దేశంతో ప్రభుత్వం లబ్ధిదారులకు సంబంధించి సజీవ నిర్ధారణ సర్వే చేపడుతోంది. ఈ ప్రక్రియ ఇటీవల ప్రారంభమైంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు ఎఫ్‌ఆర్‌ఎస్ (ఫేషియల్ రికగ్నైజ్ స్కాన్) చేపడుతున్నారు. లబ్ధిదారులు బతికుంటేనే ఇక నుంచి పింఛన్ పొందే అవకాశం ఉంటుంది. కొన్నిచోట్ల లబ్ధిదారులు చనిపో యినప్పటికీ వారి బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమ అవుతోంది. ఈ సర్వేతో అర్హులైన వారికి మాత్రమే పింఛన్ వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో 52,511 పింఛన్ లబ్దిదారులున్నారు. గతంలో పింఛన్‌దారుడు మృతి చెందితే వారి కుటుంబ సభ్యులు మరణ ధ్రువీకరణ పత్రం అందిస్తేనే మృతిచెందినట్లు తెలిసేది. కొందరు తెలియ కపోవడంతో ప్రతీనెల వారి అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి. కొన్నిచోట్ల బోగస్ పింఛన్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌తో అర్హులైన వారికి అందనున్నాయి. ఈ మేరకు అధికారులు లబ్ధిదారుల ఇళ్లకువెళ్లి సెల్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న ఫెషియల్ రికగ్నైజ్ యాప్‌తో స్కాన్ చేస్తారు. ఆధార్‌కార్డు డాటాతో వివరాలు మ్యాచ్ అవుతాయి. లబ్ధిదారులు మృతిచెందితే వారి వివరాలు నమోదు కావు. ఉపాధి కోసం వలస వెళ్లి స్థిరపడితే వారి గురించి తెలుసుకొని అధికారులు నిర్ధారణ చేసుకుంటారు. అర్హులై ఉన్నప్పటికీ అందు బాటులో లేకపోతే మూడు నెలల్లో ఎఫ్‌ఆర్‌ఎస్ కచ్చితంగా చేసుకోవల్సి ఉంటుంది. లేకపోతే అధికారులు లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తా రు. ఈ మేరకు జిల్లాలోని రెండు మున్సిపాలిటీలు, 335 గ్రామ పంచాయతీలలో సర్వే చేస్తున్నారు.
- జిల్లాలో 52,511 మంది పింఛన్‌దారులు..
జిల్లాలో 52,511 ఉన్న పింఛన్‌దారులకు సంబం ధించిన సర్వే నెల రోజుల్లో పూర్తి చేయాలని అధికా రుల నుంచి అదేశాలు వచ్చాయి. చాలాచోట్ల చనిపో యిన వారికి సంబందించిన పింఛన్లు బ్యాంకు ఖాతాల్లో పడడం, ఇతరుల పేర్లు పెట్టి పింఛన్లు పొందిన సంఘటనలున్నాయి. తాజాగా బోగస్‌తో పాటు చనిపోయిన వారి పేర్లు తొలగిస్తా రు. ఇక నుంచి అర్హులకే పింఛన్లు అందుతాయి. పక్కదారి పట్టే అవకాశం ఉండదు. కాగా చేయూత పింఛన్ల మంజూరుపై గతంలో ధరఖాస్తు చేసుకున్న వారిలో అనందం వ్యక్తమవుతోంది. కొత్త పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం, కార్యాచరణ కూడా రూపొం దించడంతో దరఖాస్తు చేసుకున్న వారిలో ఈసారి వస్తాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ నిర్ధారణ కార్యక్రమం చేపట్టి మృతి/బోగస్ తొలగించిన అనంతరం పెండింగ్‌లో ఉన్న ధరఖా స్తులను పరిశీ లించి కొత్త పింఛన్లు జారీ చేయను న్నారు.
జిల్లాలో పింఛన్‌దారులు ఇలా..
వృద్ధులు : 22,084
వితంతులు : 20,894
దివ్యాంగులు: 5,666
పైలేరీయా : 500
ఒంటరి మహిళలు : 2,532
ఇతరులు : 835
నిర్ధారణ సర్వే చేస్తున్నాం..
- దత్తారావు, డీఆర్‌డీవో
నిర్ధారణ సర్వే ప్రారంభమైంది. ముఖ గుర్తింపు ఉంటేనే పింఛన్ వస్తుంది. జూన్ 15 వరకు గ్రామాలు, పట్టణాల్లో గుర్తింపు సర్వే చేపడతాం. నెలరోజుల్లో పూర్తిచేసి అర్హులందరినీ గుర్తిస్తాం. ఫేస్ రికగ్నిషన్ యాప్‌లో వివరాలు నమోదు చేసి అర్హులను గుర్తిస్తు న్నారు. అనర్హులు తేలితే జాబితా నుంచి పేర్లను తొలగించడానికి చర్యలు తీసుకుంటు న్నాం. సర్వే కోసం వస్తున్న అధికారులకు లబ్ధిదా రులు సహకరించాలి.