Share News

ప్రజలకు చేసిన సేవలే చిరస్థాయిగా మిగిలి పోతాయ్‌

ABN , Publish Date - May 30 , 2026 | 11:25 PM

: ప్రజలకు చేసిన సేవలే చిరస్థా యిగా మిగిలి పోతాయని, రాజకీయాల్లోకి ఎందరో వస్తారు, పొతారు పదవులు శాశ్వతం కాదని హర్యానా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రే య అన్నారు.

ప్రజలకు చేసిన సేవలే చిరస్థాయిగా మిగిలి పోతాయ్‌
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, పక్కన జిల్లా నేతలు

పుస్తకావిష్కరణలో హర్యానా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ

నస్పూర్‌, మే 30 (ఆంధ్రజ్యోతి) : ప్రజలకు చేసిన సేవలే చిరస్థా యిగా మిగిలి పోతాయని, రాజకీయాల్లోకి ఎందరో వస్తారు, పొతారు పదవులు శాశ్వతం కాదని హర్యానా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రే య అన్నారు. నస్పూర్‌ పట్టణం సీసీసీ సింగరేణి కాన్ఫరెన్స్‌ హాల్‌లో శనివారం తాను రాసిన ‘‘ప్రజల కథే నా ఆత్మకథ’’ పుస్తకాన్ని బీజేపీ జి ల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌ గౌడ్‌, సీనియర్‌ నాయకుడు గోనె శ్యాం సుందర్‌ రావులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దత్తాత్రే య మాట్లాడుతూ తాను సామాన్య కుటుంబం నుంచి వచ్చానని, ఎన్ని పదువులు చేపట్టినా బాధ్యత కలిగిన కార్యకర్తగానే నేటికి పని చేస్తాన న్నారు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ ద్వారా ప్రదాని మోదీ ఆధ్వర్యం లో అన్ని రంగాలు అభివృద్ధి సాధిస్తాయన్నారు. కొన్ని శక్తులు జాతీయ సమైక్యతను నాశనం చేయాలని కుట్రలు పన్నుతున్నయన్నారు. ప్రజ లందరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సరైనా ప్రణాళిక తయారు చేయనందు న రైతులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందన్నారు. అధికారులు, రైస్‌ మిల్లర్లు కుమ్మకై రైతులను అవస్థలకు గురి చేస్తున్నారన్నారు. పం ట వచ్చే ముందుగానే ఎంత ధాన్యం వస్తుందని అంచనా వేయలేక పోయరన్నారు. బెంగాల్‌లో వచ్చిన విధంగా తెలంగాణలో కూడా మా ర్పు రావాల్సినవరం ఉందన్నారు. ఆ దిశగా నాయకులు, కార్యకర్తలు నిరంతరం పని చేస్తూ గ్రామ గ్రామాన ప్రజల్ని చైతన్యవంతుగా చే యాలని బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. సమావేశానికి ముం దుగా వంతేమాతర గీతం ఆలాపన, అనంతరం దత్తాత్రేయ రాసిన ‘‘ ప్రజల కథే నా ఆత్మకథ’’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో నాయకులు మధు, క్రిష్ణమూర్తి, అశోక్‌, తుల మధుసూదన్‌రావు, తుల అంజనేయులు, పొన్నవేన సదనందం, విజయ్‌ పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2026 | 11:25 PM