kumaram bheem asifabad- మిగిలింది నెల రోజులే..
ABN , Publish Date - Feb 28 , 2026 | 11:07 PM
మున్సి పాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లకు మరో నెల రోజు లు మిగిలింది. ఆర్థిక సంవత్సరం మార్చితో ముగి యనుండడంతో ఆస్తి పన్ను వసూళ్లను వేగవంతం చేసేందుకు మున్సిపల్ శాఖ ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించింది. జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూల్లను వేగవంతం చేసేందుకు మున్సిపల్ అధికారులు పకడ్బందీ చర్యలు చేపడు తున్నారు. ఆర్థిక సంవత్సరాంతం సమీపిస్తున్న నేపథ్యంలో వంద శాతం వసూళ్ల సాధించాలనే లక్ష్యంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
- వంద శాతం లక్ష్యంగా అడుగులు
- ఇంటింటికీ వెళుతున్న సిబ్బంది
- జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో లక్ష్యం రూ. 4.52 కోట్లు
కాగజ్‌నగర్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): మున్సి పాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లకు మరో నెల రోజు లు మిగిలింది. ఆర్థిక సంవత్సరం మార్చితో ముగి యనుండడంతో ఆస్తి పన్ను వసూళ్లను వేగవంతం చేసేందుకు మున్సిపల్ శాఖ ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించింది. జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూల్లను వేగవంతం చేసేందుకు మున్సిపల్ అధికారులు పకడ్బందీ చర్యలు చేపడు తున్నారు. ఆర్థిక సంవత్సరాంతం సమీపిస్తున్న నేపథ్యంలో వంద శాతం వసూళ్ల సాధించాలనే లక్ష్యంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతీ వార్డులో సిబ్బంది ఇంటింటికి వెళ్లి బకాయిలు వివరాలు తెలియజేస్తూ పన్ను చెల్లించాలని అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల్లో ప్రత్యేక రైడ్ నిర్వహిస్తున్నారు. మార్చి 31వ తేదీలోగా పూర్తి స్థాయిలో పన్నులు వసూళ్ల లక్ష్యం చేసే దిశగా ప్రయత్నిస్తున్నారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో 13,548 ఇళ్లకు ఆస్తి పన్ను రూ.3.47 కోట్లు రావల్సి ఉంది. ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి లక్ష్యం 5,123 ఇళ్లకు లక్ష్యం రూ.1.05 కోట్లు ఉంది. ఆస్తి పన్ను వసూళ్ల కోసం కాగజ్‌నగర్ మున్సిపల్ చైర్‌పర్సన్ షాహీన్‌సుల్తాన, కమిషనర్ తిరుపతి ఆధ్వర్యంలో సిబ్బందికి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 30 వార్డులకు సిబ్బందిని కేటాయించారు. ఈ సిబ్బందికి అదనంగా వార్డు అధికారులను కూ డా ఇన్‌చార్జిలుగా ఉండేలా తగిన ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటల నుంచి 30 వార్డుల్లో సిబ్బంది ఇంటింటికి వెళ్లి బకాయిలను వివరించి వసూళ్లు చేస్తున్నారు. ఆన్‌లైన్ చేసేందుకు వెసులు బాటు కల్పించారు. దీంతో వసూళ్ల లక్ష్యం శరవేగంగా చేపడుతున్నారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీల్లో రూ.3.47 కోట్లు ఉండగా, ఇందులో ఇప్పటి వరకు రూ.1.70 కోట్లు వసూలు చేశారు. ఇంకా రూ.2.57 కోట్లు వసూలు చేసి 46 శాతానికి వచ్చారు.
- ప్రణాళిక ప్రకారం..
వందశాతం వసూళ్ల కోసం నెల రోజుల గడువు ఉండడంతో పక్కా ప్రణాళికలు వేసి వసూలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్షేత్ర స్థాయిలో తిరిగిన సిబ్బందితో కమిషనర్ తిరుపతి ప్రత్యేక సమావేశం తీసుకొని వచ్చిన వసూళ్లు, పెండింగ్ ఎంత ఉంది అనే అంశాలపై సిబ్బందితో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసి ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. ఇక పెండింగ్ బకాయిలపై కూడా దృష్టి సారించారు. వీరికి నోటీసులను ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఆసిఫాబాద్ మున్సిపాల్టీలో కూడా మున్సిపల్ చైర్మన్ అకాష్, కమిషనర్ గజానంద్ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది ఆస్తి పన్ను వసూలుపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. 20 వార్డుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్న సిబ్బందితో ఇంటింటా తిరుగుతున్నారు. కచ్చితంగా పన్నులు చెల్లించాలని ప్రజలకు సూచి స్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఆస్తి పన్ను రూ.1.05 కోట్లు ఉంది. 50 లక్షల మేర వసూలుతో 50 శాతం వచ్చింది. వంద శాతం వసూళ్లకు మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నారు. ఇక ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన ఆస్తిపన్ను వసూళ్ల కోసం ముందస్తుగానే డిమాండ్ నోటీసులను పంపించారు. ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ పన్ను, కులాయి పన్ను పూర్తిగా వసూలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
పట్టణాభివృద్ధికి సహకరించాలి..
-షాహీన్ సుల్తానా, మున్సిపల్ చైర్‌పర్సన్, కాగజ్‌నగర్
ఆస్తి పన్ను ప్రతి ఒక్కరూ చెల్లించి పట్టణా భివృద్ధికి సహకరించాలి. పెండింగ్ బకాయిలు ఉన్న వారు సైతం వెంటనే చెల్లించాలి. బకాయిదారులకు ఇప్పటికే డిమాండ్ నోటీసులు పింపించాం. పట్టణంలో అభివృద్ధి పనులు ముందుకు సాగాలం టే ప్రజలు పన్నులు పూర్తి స్థాయిలో చెల్లించి సహకారం అందించాలి.
ప్రణాళికాబద్ధంగా ఆస్తి పన్ను వసూళ్లు..
- తిరుపతి, కాగజ్‌నగర్ మున్సిపల్ కమిషనర్
ఆస్తి పన్ను వసూలు కోసం ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్నాం. 30 వార్డుల్లో వార్డు అధికారులతో పాటు సిబ్బందితో ప్రత్యేక రైడ్ నిర్వహిస్తున్నాం. ఇంటింటికీ వెళ్లి అవ గాహన కల్పిస్తున్నాం. తప్పకుండా ఆస్తి పన్ను చెల్లించాలని సూచిస్తున్నాం. దీర్ఘకాలికంగా పెండింగ్‌లలో ఉన్న బకాయిల వసూళ్లకు సైతం చర్యలు తీసుకుంటున్నాం.