kumaram bheem asifabad- కొనసాగుతున్న వన్యప్రాణి వారోత్సవాలు
ABN , Publish Date - Oct 04 , 2026 | 10:34 PM
జిల్లా కేంద్రంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఈనెల 2న ప్రారంభమైన వన్యప్రాణి వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అటవీశాఖ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పోటీలకు మొత్తం 50 మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఆసిఫాబాద్‌రూరల్, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఈనెల 2న ప్రారంభమైన వన్యప్రాణి వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అటవీశాఖ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పోటీలకు మొత్తం 50 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ వన్యప్రాణి సంరక్షణ, వాటి ప్రాదాన్యం తెలియజేయడం కోసం వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణలో ప్రజలను భాగస్వాములను చేయడమే అటవీశాఖ లక్ష్యమని చెప్పారు. ఈనెల 8 వరకు వివిధ రకాల పోటీలను నిర్వహించనున్నామని వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ అబ్దుల్ రహీం, అటవి సెక్షన్ అధికారి మహేందర్, బీట్ అధికారులు సాదిక్ పాషా, ప్రకాష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
సిర్పూరు(టి), (ఆంధ్రజ్యోతి): విద్యార్ధి దశ నుంచే పర్యావరణం పట్ల అవగాహన ఉండాలని ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాస్ తెలిపారు. జాతీయ వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా సిర్పూరు(టి) లోని ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలలో అటవీ శాఖ ఆధ్వర్యంలో చిత్రలేఖనం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవులన్నీంటిని సమానంగా చూడగలిగేలా పరివర్తన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీట్ ఆఫీసర్లు రవీనా, అరుణ్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పెంచికల్‌పేట్, (ఆంధ్రజ్యోతి): జాతీయ వన్యప్రాణి వారోత్సవాలను పురస్కరించుకొని పెంచికల్‌ఫేటలోని అటవీ రేంజ్ ఆధ్వర్యంలో ఆదివారం చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యార్థుల్లో అడవులు, వన్యప్రాణుల సంరక్షణ పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌వో అస్మా, ఎఫ్‌ఎస్‌వో అహ్మద్ అలీ, గోవింద్, బీట్ అధికారులు సతీష్, స్వర్ణలత, శిరీషలతో పాటు ఉపాధ్యాయులు బాలాజీ, విద్యార్థులు పాల్గొన్నారు.