Share News

కొనసాగుతున్న ఎస్‌ఎస్‌సీ పరీక్షలు

ABN , Publish Date - Mar 28 , 2026 | 11:10 PM

జిల్లాలో పదో తరగతి వార్షిక ప రీక్షలు ప్రశాంతంగా కొనాగుతున్నాయి.

కొనసాగుతున్న ఎస్‌ఎస్‌సీ పరీక్షలు
తాడూరులో పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసి బయటకు వస్తున్న డీఈవో

- కల్వకుర్తి, తాడూరు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన డీఈవో రమేశ్‌ కుమార్‌

నాగర్‌కర్నూల్‌ టౌన్‌/ కల్వకుర్తి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో పదో తరగతి వార్షిక ప రీక్షలు ప్రశాంతంగా కొనాగుతున్నాయి. శనివా రం గణితశాస్త్రం పరీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 60 పరీక్ష కేంద్రాల పరిధిలో మొత్తం 10,650 మంది విద్యార్థులు ఉండగా గణిత పరీ క్షకు 10,630 మంది హాజరు కాగా 20 మంది విద్యార్థులు హాజరు కాలేదు. జిల్లా విద్యాధికారి రమేష్‌కుమార్‌ శనివారం కల్వకుర్తి మండలం లోని జేపీనగర్‌ గురుకుల పాఠశాల, జిల్లా పరి షత్‌ బాలికల ఉన్నత పాఠశా లలతో పాటు తాడూరు మం డల కేంద్రంలోని జిల్లా పరిష త్‌ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసి పరీక్ష కేంద్రంలో అందుబాటులో ఉ న్న మౌలిక సదుపాయాలు, సీసీ కెమెరా వ్యవస్థను పరిశీ లించారు. విద్యార్థులకు ఎలాం టి ఇబ్బందులు కలగకుండా తా గునీరు, ప్రథమ చికిత్స వసతిని అన్ని పరీక్షలకు ఉండేలా చూడాలని పరీక్షల నిర్వహణ అధికా రులను డీఈవో ఆదేశించారు.

కల్వకుర్తి పట్టణంలోని హను మాన్‌నగర్‌ ప్రాథమికోన్నత పాఠశాల, ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల విద్యా ప్రమాణాలను డీఈవో పరిశీలించారు.

Updated Date - Mar 28 , 2026 | 11:10 PM