కొనసాగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు
ABN , Publish Date - Oct 18 , 2026 | 11:28 PM
నారాయణ పేట జిల్లా వ్యాప్తంగా దుర్గా ష్టమి ప్రత్యేక పూజలు కొన సాగాయి.
- దుర్గాదేవి అవతారంలో అమ్మవార్ల దర్శనం
- అనంతసేన ఆలయంలో కనుల పండువగా గరుడ వాహన సేవ
నారాయణపేట/నారా యణపేట రూరల్/ఊట్కూర్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): నారాయణ పేట జిల్లా వ్యాప్తంగా దుర్గా ష్టమి ప్రత్యేక పూజలు కొన సాగాయి. నారాయణపేట పట్టణంలోని భవానీ, చౌడే శ్వరి, బాలాజీ, రాఘవేంద్రస్వామి, అనంతసేన ఆలయం, కాళికామాత, మరిగమ్మ శక్తిపీఠంలో ఉత్సవాలు కొనసాగాయి. అనంతసేన ఆల యంలో అర్చకుడు శ్రీపాద్ ఆధ్వర్యంలో గరుడ వాహన సేవ కనుల పండువగా జరిగింది. ము నిసిపల్ వైస్ చైర్పర్సన్ మంజులజీఆర్రెడ్డి, కౌ న్సిలర్ జయశ్రీ, మాజీ కౌన్సిలర్లు శిరీషాచెన్నా రెడ్డి, మేఘన, గందెచంద్రకాంత్, జొన్నల సుభా ష్, భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. శక్తి పీఠంలో దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమి చ్చారు. నారాయణపేటలో ఆర్యవైశ్య సంఘం ఆ ధ్వర్యంలో వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాల యంలో, అశోక్నగర్లోని మలాంబికాదేవి ఆల యంలో అమ్మవార్లు దుర్గాదేవిగా దర్శనమి చ్చారు. శివాజీనగర్లోని గజలేశ్వరి దేవాలయంలో మహిళా మండలి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు ఆలయంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అన్నదానం చేపట్టారు.
నారాయణపేట మండలంలోని సింగారం శ్రీగిరి పీఠంపై కొలువైన భవానీమాత ఆలయంతో పాటు కోటకొండ కన్యకాపరమేశ్వరి దేవాలయాల్లో ఆదివారం అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
ఊట్కూర్లోని భవానీమాత మందిరంలో అ మ్మవారు తారాదేవి రూపంలో భక్తులకు దర్శన మిచ్చారు. బిజ్వార్ గ్రామంలోని అంభాత్రయ క్షేత్రంలో అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు.