Share News

మార్చి 15 నుంచి ‘ఒంటిపూట’ బడులు

ABN , Publish Date - Mar 13 , 2026 | 04:49 AM

రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది...

మార్చి 15 నుంచి ‘ఒంటిపూట’ బడులు

హైదరాబాద్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 15 నుంచి విద్యాసంవత్సరం అఖరు రోజైన ఏప్రిల్‌ 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ సంచాలకులు నవీన్‌ నికోలస్‌ ఆదేశించారు. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలన్నీ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకే నిర్వహించాలన్నారు. పదోతరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న ఆయా పాఠశాలల్లో.. పరీక్ష జరిగే రోజు తరగతులను మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించాలని చెప్పారు. పదోతరగతి విద్యార్థులకు మాత్రం యథావిధిగా తరగతులు కొనసాగించవచ్చని గురువారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో విద్యాశాఖ పేర్కొంది.

Updated Date - Mar 13 , 2026 | 04:49 AM