కష్టపడి ఉన్నత లక్ష్యాలను సాధించాలి..
ABN , Publish Date - Nov 23 , 2026 | 11:36 PM
విద్యార్థినీ విద్యార్థులు లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్ రావు అన్నారు. నస్పూర్ పట్టణం తీగల్ పహాడ్ జిల్లా పరిషత్ పాఠ శాలను సోమవారం సందర్శించారు. పాఠశాలలో విధ్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు
నస్పూర్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థినీ విద్యార్థులు లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్ రావు అన్నారు. నస్పూర్ పట్టణం తీగల్ పహాడ్ జిల్లా పరిషత్ పాఠ శాలను సోమవారం సందర్శించారు. పాఠశాలలో విధ్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. మౌళిక సదుపాయా లు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, నాణ్యత, నిర్వహణ వివరాలను తె లుసుకున్నారు. విద్యార్థుల హజరు పట్టికను పరిశీలించి హాజరు శాతం, వి ద్యా ప్రమాణాలు, బోధన విధానం గురించి ఉపాధ్యాయులతో చర్చించారు. పాఠశాలలో అందుతున్న సౌకర్యాలు, ఎదుర్కొంటున్న సమస్యల గురించి వి ద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థు లకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలన్నారు. పాఠశాల లో అవసరమైన మౌళిక సదుపాయాలపై ఉపాద్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యార్థులు ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకు ని మంచి చదువుకుని రాణించాలన్నారు. ఉన్నత లక్ష్యాలను సాధించుటకు కష్టపడి చదవాలన్నారు. సమస్యలను పరిష్కరించి అవసరమైన చర్యలను చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ ధర్ని మ ధుకర్, మండల విద్యాధికారి చౌదరి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ్ కాంత్, కార్పోరేటర్లు సంపత్ రెడ్డి, రాచకొండ గోపాల్ రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.