Share News

ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలి

ABN , Publish Date - Jul 24 , 2026 | 11:23 PM

పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని, గ్రామాల్లోని ప్రజలతో సత్సంబంధా లను కలిగి ఉండాలని రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా పేర్కొ న్నారు.

ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలి
పోలీస్‌స్టేషన్‌లో రికార్డులను పరిశీలిస్తున్న రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా

-రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా

తాండూర్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి) : పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని, గ్రామాల్లోని ప్రజలతో సత్సంబంధా లను కలిగి ఉండాలని రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా పేర్కొ న్నారు. శుక్రవారం తాండూర్‌ సర్కిల్‌ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు డీసీపీ భాస్కర్‌, ఏసీపీ కిరణ్‌కుమార్‌, సీఐ దేవయ్య లు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సీపీ సర్కిల్‌ పరిధిలో నమోదైన గ్రేవ్‌ కేసులు, దర్యాప్తులో ఉన్న కేసుల సీడీ ఫైళ్లు, పెండింగ్‌ ట్రయల్‌ కేసు లకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడు తూ పోక్సో కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా నాణ్యమైన దర్యాప్తు నిర్వ హించాలన్నారు. భూ వివాదాలకు సంబంధించిన ప్రతి ఫిర్యాదును నిష్పక్ష పాతంగా నిజాయితీతో విచారించి చట్టబద్దంగా దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోను వ్యక్తులపై అనవసరంగా బలప్రయోగం చేయరాదని స్పష్టం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో పరిస్థితులకు అ నుగుణంగా అవసరమైన మేరకే చట్టబద్దమైన బలాన్ని వినియోగించాల న్నారు. నేరాల నియంత్రణకు రాత్రివేళల్లో ప్రివెంటివ్‌ పెట్రోలింగ్‌, వాహనా ల తనిఖీలు నిర్వహించారు. సర్కిల్‌పరిధిలోని రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. నేరాల దర్యాప్తులో వస్తున్న తా జా పరిణామాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంపొందించుకోవాలని సూ చించారు. ప్రతి పిటీషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించి ఫిర్యాదు దారుల వివరా లను సమగ్రంగా ధృవీకరించాలని తెలిపారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యా దుదారులకు సాధ్యమైనంత వరకు చట్ట పరిధిలో సహాయం అందించాలని సూచించారు. ప్రతి పోలీసు విధుల పట్ల అంకిత భావంతో పనిచేయాలని, శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి చేయాలని సూచించారు. అ నంతరం పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2026 | 11:23 PM