ఉత్తమ విద్యా విధానాలపై అధ్యయనం చేయాలి
ABN , Publish Date - Nov 18 , 2026 | 11:52 PM
ప్రధానమంత్రి శ్రీ పాఠశాలల సమగ్ర అభివృద్ధి, నాణ్యమైన విద్యాబోధన, ఆధునిక బోధన పద్ధ తులపై అధ్యయనం చేసి అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ కు మార్ దీపక్ అన్నారు.
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి) : ప్రధానమంత్రి శ్రీ పాఠశాలల సమగ్ర అభివృద్ధి, నాణ్యమైన విద్యాబోధన, ఆధునిక బోధన పద్ధ తులపై అధ్యయనం చేసి అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ కు మార్ దీపక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయం భవన సముదా యం ఆవరణలో జిల్లాకు చెందిన 25 మంది పీఎంశ్రీ పాఠశాలల ప్రధానో పాధ్యాయుడు, కో ఆర్డినేటర్లతో కూడిన బృందం ఈ నెల 21వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు విద్య ఆధ్యయన పర్యటనలో భాగంగా బెంగుళూరు, మైసూరు ప్రాంతాల్లోని విద్యాసంస్థల సందర్శనకు వెళ్తున్న బస్సును జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ అధ్యయన పర్యటనలో భాగం గా ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్‌లను బృందం సందర్శిస్తుందని తెలిపారు. ఆ ధునిక విద్యా పద్ధతులు, నాయకత్వ లక్షణాలు, విద్యా ప్రణాళికలు, వినూత్న బోధన విధానాలు తదితర వాటిని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తారన్నారు. ఈ అధ్యయన పర్యటనలో తెలుసుకున్న అంశాలు, పొందిన అనుభవాలు, ఉత్తమ విధానాలను తమ పాఠశాలల్లో సమర్ధవంతంగా అమలు చేసి పీ ఎంశ్రీ పాఠశాలలను ఆదర్శ విద్యాసంస్థలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాల న్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, డీఈవో చంద్రయ్య, అధికారు లు పాల్గొన్నారు.