Share News

బాధితుల పట్ల మానవత్వంతో స్పందించాలి

ABN , Publish Date - Jun 20 , 2026 | 11:36 PM

భరోసా కేంద్రాల సేవలను మరింత బలోపేతం చేసేందుకు అధికారుల సమన్వయం ఎంతో అవసరమని మహిళ లు, పిల్లల రక్షణ కోసం బాధితుల పట్ల మానవ త్వం తో స్పందించాలని సీపీ అంబర్‌కి షోర్‌ఝా అన్నారు.

 బాధితుల పట్ల మానవత్వంతో స్పందించాలి
అధికారుల సమన్వయ సమావేశంలో మాట్లాడుతున్న అంబర్‌కిషర్‌ఝా

మంచిర్యాలక్రైం, జూన్‌20 (ఆంధ్రజ్యోతి): భరోసా కేంద్రాల సేవలను మరింత బలోపేతం చేసేందుకు అధికారుల సమన్వయం ఎంతో అవసరమని మహిళ లు, పిల్లల రక్షణ కోసం బాధితుల పట్ల మానవ త్వం తో స్పందించాలని సీపీ అంబర్‌కి షోర్‌ఝా అన్నారు. మహిళలు, పిల్లలపై హింసా, వేధింపులు దుర్వినియో గానికి బాధితులకు సమగ్ర రక్షణ సాయం పునరావా సం న్యాయసేవలను మరింత సమర్థవంతంగా అందిం చేందుకు రాష్ట్ర మహిళా భద్రత విభాగం (డబ్ల్యుఎస్‌ డబ్ల్యుఎస్‌) భరోసా పీఎంయు ఆదేశాల మేరకు సమ న్వయ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. వైద్యశాఖ, మహిళ, శిశు సంక్షేమశాఖ జిల్లా న్యాయసేవా సంస్థల బాలల సంరక్షణ విభాగాలు, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ ప్రతిని ధులు, స్వచ్చంద సంస్థలు, కౌన్సిలర్లు, ఇతర భాగస్వా మ్యశాఖల అధికారులతో సమన్వయ కార్యక్రమం ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులకు అందిస్తున్న సేవలను మరింత ప్రభావ వంతంగా తీర్చిదిద్దేందుకు అన్నిశాఖల మధ్య సమన్వయం అత్యంత అవసరమన్నారు. బాధితుడితో, సానుభూతితో, మానవత దృక్పథంతో వ్యవ హరించాల న్నారు. కొన్ని సందర్భాల్లో బాధితులకు కుటుంబ సభ్యు ల సహకారాలు లభించకపోవచ్చునని అలాంటి పరిస్థి తుల్లో కూడ చట్టపరంగా మానవతాదృక్పథంతో మాన సిక పరంగా వారికి అవసరమైన సాయాన్ని అందిం చాలని సూచించారు. అవసరమైతే సంబంధిత ప్రభు త్వశాఖలతో సమన్వయం చేసుకొని బాధితుల సమ స్యలు పరిష్కరించాలన్నారు. అవసరమైతే పోలీసు క మిషనరేట్‌లో నేరుగా సంప్రదించాలని తెలిపారు. బాధి తుల ఫిర్యాదుల ఆధారంగా కేసుల నమోదు విషయం లో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం, లేదా అలసత్వం వహిం చవద్దన్నారు. ముందుగా కేసు నమోదు చేసుకొని అ నంతరం దర్యాప్తు ప్రారంభించాలన్నారు. నిర్లక్ష్యం వహి స్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్‌ కే. శ్రీనివాస్‌, పెద్దపల్లి సీఐ రమేశ్‌బాబు, మహిళాపోలీసు స్టేషన్‌ సీఐ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

సిబ్బంది సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌

పోలీసు సిబ్బంది సమస్యల పరిస్కారానికే గ్రీవెన్స్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ఝా అన్నారు. శనివారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో బదిలీలు, క్రమశిక్షణ చర్యలు తదితర అంశాలకు సం బంధించి సిబ్బంది నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వాటి పరిస్కారానికి చట్టపరిధిలో త్వరి గతిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Updated Date - Jun 20 , 2026 | 11:36 PM