Share News

kumaram bheem asifabad-దేశ ఐక్యతలో భాగస్వాములు కావాలి

ABN , Publish Date - Oct 31 , 2026 | 11:16 PM

దేశ ఐక్యతకు, సమగ్రతకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్‌ హరిత అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో సర్థార్‌ వల్లబాయ్‌ పటేల్‌ జయంతిని పురష్కరించుకొని జాతీయ ఐక్యత దినోత్సవ సందర్భంగా అధికారులు, ఉద్యోగులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బారతదేశంలో విభిన్న బాషలు విభిన్న సంస్కృతులు ఉంటాయని చెప్పారు.

kumaram bheem asifabad-దేశ ఐక్యతలో భాగస్వాములు కావాలి
ఆసిఫాబాద్‌లో ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న కలెక్టర్‌ హరిత

ఆసిఫాబాద్‌, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): దేశ ఐక్యతకు, సమగ్రతకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్‌ హరిత అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో సర్థార్‌ వల్లబాయ్‌ పటేల్‌ జయంతిని పురష్కరించుకొని జాతీయ ఐక్యత దినోత్సవ సందర్భంగా అధికారులు, ఉద్యోగులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బారతదేశంలో విభిన్న బాషలు విభిన్న సంస్కృతులు ఉంటాయని చెప్పారు. ప్రతీ ఒక్కరు దేశ సమగ్రత ఐక్యతకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, డీఆర్వో వేణు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ అటవీశీఖ ఆధ్వర్యంలో శనివారం స్వాతంత్ర సమర యోధుడు సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్‌డీవో అప్పయ్య ఆద్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అటవీ రేంజ్‌ అధికారి లక్ష్మినారాయణ, డీఆర్‌ఓ సిబ్బంది పాల్గొన్నారు.

వాంకిడి, (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా భారతదేశ తొలి ఉపప్రధానమంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకుని శనివారం ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వాంకిడి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఆయన చిత్రపటానికి ఫూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి చంద్రయ్య మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రత కోసం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చేసిన సే వలను కొనియాడారు. కార్యక్రమంలో అధ్యాపకులు సంతోష్‌, రాజమౌళి, శ్రీధర్‌, సురేందర్‌ కుమార్‌, తిరుపతి, గోపాల్‌, విట్టల్‌, జాకీర్‌, అర్చన తదితరులు పాల్గొన్నారు.

రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): బ్రిటీష్‌ పాలకుల చేతిలో ముక్కలైన దేశాన్ని అఖండ భారతం గా ఏకం చేసిన దైర్యశాలి, ఉక్కు మనిషి సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ అని బెల్లంపల్లి ఏరియా జనరల్‌ మేనేజర్‌ ఎం.శ్రీ రమేష్‌ అన్నారు. గోలేటి జనరల్‌ మేనేజర్‌ కార్యాలయ ఆవరణలో సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకొని జాతీయ ఐక్యత దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకుడు జూపాక రాజేష్‌, ఏరియా ఇంజనీర్‌, ఏరియా అధికారుల సంఘం కార్యదర్శి వీరన్న డీజీఎం (ఐఈడీ) ఉజ్వల్‌ కుమార్‌ బెహరా, సీనియర్‌ పర్సనల్‌ అధికారి ఎం.శ్రీనివాస్‌, డి ప్రశాంత్‌, నిర్వహకులు చంద్రమౌళి, రాజేష్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

సిర్పూరు(టి) (ఆంధ్రజ్యోతి): మండల పరిషత్‌ కార్యాలయంలో సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కోట ప్రసాద్‌, ఏపీవో చంద్రయ్య, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. వల్లభాయ్‌ పటెల్‌ జయంతి సందర్బంగా ఎఫ్‌ఆర్వో శ్రీనివాస్‌ నేతృత్వంలో రాష్ట్రీయ ఏక్తా దివస్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): జాతీయ ఐక్యతను భావితరాలకు అందించాలని తహసీల్దార్‌ రామ్మోహన్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్బంగా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డీటీ బీమ్లానాయక్‌, ఆర్‌ఐ రవీంద్ర, సీనియర్‌ అసిస్టెంట్‌ అచ్యుత్‌రావు పాల్గొన్నారు.

పెంచికల్‌పేట్‌, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో రాష్ట్రీయ ఏక్తా దివస్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రవీందర్‌, డీటీ చిన్ను, ఆర్‌ఐ రాజేశ్వర్‌, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2026 | 11:16 PM