ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Aug 10 , 2026 | 10:58 PM
పోలీసు ఉద్యోగాలకు దర ఖాస్తు చేసుకున్న యువతకు కొక్కిరాల రఘుపతిరావు చారిట్రబుల్ ట్ర స్టు ద్వారా నిర్వహించే ఉచిత శిక్షణ తరగతులను నిరుద్యోగ యువత స ద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నా రు.
కార్పొరేటర్లు తనను విడిచివెళ్తారనడం అవాస్తవం
ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు
మంచిర్యాలక్రైం, ఆగస్టు10 (ఆంధ్రజ్యోతి): పోలీసు ఉద్యోగాలకు దర ఖాస్తు చేసుకున్న యువతకు కొక్కిరాల రఘుపతిరావు చారిట్రబుల్ ట్ర స్టు ద్వారా నిర్వహించే ఉచిత శిక్షణ తరగతులను నిరుద్యోగ యువత స ద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నా రు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూలైలో నిరుద్యోగులకు శుభ వార్త చెబుతూ 7,437 పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్‌ను విడుదల చేశారన్నారు. జిల్లాకు చెందిన యువత పోలీసు ఉద్యోగాలు దరఖాస్తుల ప్రక్రి య కోసం రిటైర్డ్ పోలీసు ఆఫీసర్ నాగార్జున స్కానర్ రూపంలో ఈ నెల 16వ తేదీ వరకు ఫాం పూర్తి చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చే సుకున్న యువతకు మంచిర్యాల పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్ చౌ రస్తా వద్ద నుంచి టీటీడీ మండపంలో ఆగస్టు 20న రాజీవ్‌గాంధీ జయం తి సందర్భంగా కొక్కిరాల రఘుపతిరావు చారిట్రబుల్ ట్రస్టు ద్వారా ఉ చిత శిక్షణ తరగతులను అందిస్తామన్నారు. వారికి భోజన సౌకర్యాన్ని కూడ కల్పిస్తూ మంచి మెటీరియల్‌ను అందించి రెండు నెలలు శిక్షణ త రగతులను నిర్వహిస్తామన్నారు. దీనిని యువత సద్వినియోగం చేసుకో వాలన్నారు. కాలేజీరోడ్డులో పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రభు త్వ పాఠశాల విద్యార్థులకు ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో సెంట్రలైజ్డ్ కిచెన్ పనులను వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. మొదట అల్ఫాహారం పంపిణీ చేస్తామని దసరా నుంచి మధ్యాహ్న భోజనం పంపిణీ జరుగు తుందన్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు తనను విడిచి వెళ్తారనే ప్రచారం అ వాస్తవమన్నారు. పార్టీలో విబేధాలు ఉన్నట్లు ప్రజల్లో అపోహా సృష్టించా లనుకునే బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులకు ప్రజలే బుద్దిచెబుతారని హె చ్చరించారు. నేటి నుంచి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో తాగునీటి సరఫరా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మేయర్ ధర్ని మధూకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి భానేష్, నాయకులు పూదరి తిరుపతి, తూముల నరేశ్, గజ్జెల హేమంత్‌్‌రావు, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు