kumaram bheem asifabad- సమాచార హక్కు చట్టంపై అవగాహన పెంచుకోవాలి
ABN , Publish Date - Oct 28 , 2026 | 10:31 PM
సమాచార హక్కు చట్టంలోని ప్రతి సెక్షనుపై ప్రజా సమాచార అధికారులు, సహాయ ప్రజా సమాచార అధికారులు, అప్పిలేట్ అధికారులు పూర్తి అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ డాక్టర్ జి. చంద్రశేఖర్రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో బుధవారం రాష్ట్ర సమాచార కమిషనర్లు పీవీ శ్రీనివాసరావు, మోసిన పర్వీన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్యరెడ్డి, వైష్ణవి మెర్ల, కలెక్టర్ కె హరిత, అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం డేవిడ్, ఏఎస్పీ. చిత్తరంజన్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ హర్ష చౌదరిలతో కలిసి అప్పిలేట్ అధికారులు, ప్రజా సమాచార అధికారులు, సహాయ ప్రజా సమాచార అధికారులకు నిర్వహించిన సమాచార హక్కు చట్టం సెక్షన్ల అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఆసిఫాబాద్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): సమాచార హక్కు చట్టంలోని ప్రతి సెక్షనుపై ప్రజా సమాచార అధికారులు, సహాయ ప్రజా సమాచార అధికారులు, అప్పిలేట్ అధికారులు పూర్తి అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ డాక్టర్ జి. చంద్రశేఖర్రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో బుధవారం రాష్ట్ర సమాచార కమిషనర్లు పీవీ శ్రీనివాసరావు, మోసిన పర్వీన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్యరెడ్డి, వైష్ణవి మెర్ల, కలెక్టర్ కె హరిత, అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం డేవిడ్, ఏఎస్పీ. చిత్తరంజన్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ హర్ష చౌదరిలతో కలిసి అప్పిలేట్ అధికారులు, ప్రజా సమాచార అధికారులు, సహాయ ప్రజా సమాచార అధికారులకు నిర్వహించిన సమాచార హక్కు చట్టం సెక్షన్ల అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమాచార హక్కు చట్టంలోని ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉన్నప్పుడే ఆర్టీఐ దరఖాస్తుదారులకు నిర్ణీత గడువులోగా సమాచారం అందించవచ్చని తెలిపారు. సమాచారం పూర్తి పారదర్శకంగా, సరళీకృతంగా ఉండేలా చూడాలని సూచించారు. ఆర్టీఐ దరఖాస్తు అంటే ఎలాంటి ఆందోళన, భయం ఉండకూడదని చెప్పారు. దరఖాస్తులోని అంశాలను పూర్తిగా తెలుసుకోవాలని, ఇవ్వవలసిన సమాచారాన్ని అందించాలని తెలిపారు. ఉద్యోగుల వ్యక్తిగత సమాచారం ఇవ్వరాదని సూచించారు. ప్రపంచంలో 132 దేశాలలో సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలవుతుందని చెప్పారు. అధికారులు, ఉద్యోగులు బాధ్యతలు, నిర్ణయ ప్రక్రియ, పర్యవేక్షణ, జవాబుదారీతనంతో వ్యవహరించాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం కమిషనర్ల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుని అప్పిలేట్ అధికారులు, ప్రజా సమాచార అధికారులు, సహాయ ప్రజా సమాచార అధికారులు, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి సమాచార హక్కు చట్టంలోని సెక్షన్లపై అవగాహన కలిగి ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దరఖాస్తుదారులకు, పౌరులకు సమాచారాన్ని సకాలంలో అందిస్తామని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలలో పారదర్శకతను పెంపొందించడం, అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులలో జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడం కోసం చర్యలు తీసుకుంటామని వివరించారు. సమాచార హక్కు చట్టంలోని అంశాలు సెక్షన్లపై సమాచార కమిషనర్లు వివరించారు. అనంతరం సమాచార హక్కు చట్టం అప్పీలు దరఖాస్తులపై హియరింగ్ నిర్వహించారు. సమావేశంలో అప్పిలేట్ అధికారులు, ప్రజా సమాచార అధికారులు, సహాయ ప్రజా సమాచార అధికారులు పాల్గొన్నారు.