kumaram bheem asifabad- పూలాజీ బాబా బోధనలు అనుసరించాలి
ABN , Publish Date - Nov 05 , 2026 | 11:06 PM
పూలాజీ బాబా బోధనలు ప్రతీ ఒక్కరూ అనుసరించాలని ఎంపీ గోడాం నగేష్ అన్నారు. జైనూర్ మండలం పాట్నాపూర్ సిద్దేశ్వర్ సంస్థాన్‌లో పరమ హంస సద్గురు, ఆధ్యాత్మిక గురువు పూలాజీ బాబా భవ్య, దివ్య సమాధి మందిరానికి ఆదిలాబాద్ ఎంపీ గోడాం నగేష్. బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్. సంస్థాన్ అధ్యక్షుడు ఇంగ్లే కేశవ్‌రావ్ దాదా గురువారం భూమి పూజ చేశారు.
జైనూర్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): పూలాజీ బాబా బోధనలు ప్రతీ ఒక్కరూ అనుసరించాలని ఎంపీ గోడాం నగేష్ అన్నారు. జైనూర్ మండలం పాట్నాపూర్ సిద్దేశ్వర్ సంస్థాన్‌లో పరమ హంస సద్గురు, ఆధ్యాత్మిక గురువు పూలాజీ బాబా భవ్య, దివ్య సమాధి మందిరానికి ఆదిలాబాద్ ఎంపీ గోడాం నగేష్. బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్. సంస్థాన్ అధ్యక్షుడు ఇంగ్లే కేశవ్‌రావ్ దాదా గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతు పూలాజీబాబా భవ్య దివ్య మందిరం నిర్మాణం కోసం తన వతు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ మాట్లాడుతూ బాబా ఆశీర్వచనాలతో తమ కుటుంబంతో పాటు సభ్య సమాజంలో శాంతి వాతావరణం నెలకొందని చెప్పారు. భవ్య దివ్య మందిర నిర్మాణం కోసం తన వంతు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. ఆనంతరం సిద్దెశ్వర సంస్థాన్ ప్రాంగణంలో వచ్చిన ఆతిఽథులకు పాట్నాపూర్ సిద్దెశ్వర్ సంస్థాన్ కమిటీ తరపున సన్మానించారు. కార్యక్రమంలో బాబా సతీమణి ఇంగ్లే దృపదబాయి, డీఎస్పీ రఘునాథ్‌రావ్, తహసీల్దార్ ఆడ బీర్షావ్, అర్‌ఐ మోహన్, సభ్యులు మాగాడె దాదావ్, డుక్రె సుభాష్, గోవింద్, మాజీ జడ్పీటీసీ హెమలత బ్రిజులాల్, సర్పంచులు కందారె లక్ష్మీబాలాజీ, కుంర దేవశావ్, మాజీ సర్పంచ్ కుంర కేశవ్ తదితరులు పాల్గొన్నారు.