kumaram bheem asifabad- క్రీడల్లో ప్రతిభ చాటాలి
ABN , Publish Date - Nov 03 , 2026 | 10:35 PM
క్రీడాకారులు ఆటల్లో ప్రతిభన చాటాలని జవ హర్ బాల్ మంచ్ జిల్లా చైర్మన్ నైతం రాంచందర్ అన్నారు. తిర్యాణిలో అండర్-17 బాలుర వాలీబాల్ జోనల్‌స్థాయి ఎంపిక పోటీల సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రీడాకారులు క్రీడా పోటీల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకరావాలన్నారు.
తిర్యాణి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): క్రీడాకారులు ఆటల్లో ప్రతిభన చాటాలని జవ హర్ బాల్ మంచ్ జిల్లా చైర్మన్ నైతం రాంచందర్ అన్నారు. తిర్యాణిలో అండర్-17 బాలుర వాలీబాల్ జోనల్‌స్థాయి ఎంపిక పోటీల సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రీడాకారులు క్రీడా పోటీల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకరావాలన్నారు. అలాగే క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమన్నారు. ఓటమి చెందిన వారు గెలుపు కోసం కృషి చేయాలని చెప్పారు. కాంగ్రె స్ పార్టీ మండల అధ్యక్షుడు కొట్నాక గణపతి మాట్లాడుతూ అండర్-17 బాలుర వాలీబాల్ జోన్‌స్థాయి ఎంపిక పోటీలు ఈ ప్రాంతంలో నిర్వహించడం అభినం దనీయన్నారు. చదువుతో పాటు క్రీడల్లోను ప్రతిభ చాటలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా క్రమ శిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, జట్టుగా పని చేసి మనస్తత్వాన్ని అలవర్చుతాయని వివరించారు. గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులు ఎంతో క్రీడా ప్రతిభ దాగి ఉందని తెలిపారు. క్రీడాకారులు తమ ప్రతిభతో రాష్ట్రస్థాయిలో గుర్తింపు తీసుకురావాలని సూచిచారు. కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి మడావి షేకు, జోనల్ నోడల్ అధికారి మీనారెడ్డి, తిర్యాణి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రకాంత్, గిన్నెధరి హెచ్‌ఎం కృష్ణారావు, మడావి గోపాల్, రాంమోహన్ పాల్గొన్నారు.