Share News

మండపాల వద్ద అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Sep 16 , 2026 | 11:24 PM

గణపతి మండపాల వ ద్ద నిర్వహకులు అప్రమత్తంగా ఉండాలని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా పేర్కొన్నారు. బుధవారం మంచిర్యాల టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఏర్పా టు చేసిన పలు గణపతి మండపాలను సీపీ స్వయంగా పరిశీలించారు. వినా యకునికి ప్రత్యేక పూజలు చేశారు.

మండపాల వద్ద అప్రమత్తంగా ఉండాలి
మంచిర్యాలలో గణపతికి పూజలు చేస్తున్న రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా

-రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా

మంచిర్యాలక్రైం, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : గణపతి మండపాల వ ద్ద నిర్వహకులు అప్రమత్తంగా ఉండాలని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా పేర్కొన్నారు. బుధవారం మంచిర్యాల టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఏర్పా టు చేసిన పలు గణపతి మండపాలను సీపీ స్వయంగా పరిశీలించారు. వినా యకునికి ప్రత్యేక పూజలు చేశారు. మండపాల నిర్వహకులకు పలు సూచ నలు చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ మండపాల వద్ద విద్యుత్‌ అలంకరణలు, వైరింగ్‌ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మండపాల వద్ద నిర్వహకులు 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు. మండపాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. పోలీసు లు ప్రతి రోజు పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ మండపాలను తనిఖీ చేయాలన్నారు. భద్రత ఏర్పాట్లు, భక్తులకు అందుతున్న సౌకర్యాలు, ఇతర పరిస్థితులను పో లీసులు పరిశీలించాలని సూచించారు. మండపాల నిర్వహకులు పోలీసుల సూ చనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. అనంతరం పట్టణంలోని బొజ్జగణేష్‌ మండలి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట డీసీపీ భాస్కర్‌, ఏసీపీ ప్రకాష్‌, ఇన్‌స్పెక్టర్‌ ప్రమోద్‌రావు, పోలీసులు ఉన్నారు.

Updated Date - Sep 16 , 2026 | 11:24 PM