Share News

పోరాట స్ఫూర్తిని చాటుకోవాలి

ABN , Publish Date - Nov 20 , 2026 | 12:18 AM

చావునోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పోరాట స్ఫూర్తిని చాటుకోవాలని ప్రభుత్వ మాజీ విప్‌ బాల్క సుమన్‌ పిలుపునిచ్చారు. నవంబర్‌ 29న కరీంనగర్‌ జిల్లా అలుగునూర్‌లో

పోరాట స్ఫూర్తిని చాటుకోవాలి
మాట్లాడుతున్న బాల్క సుమన్‌

మంథని, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): చావునోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పోరాట స్ఫూర్తిని చాటుకోవాలని ప్రభుత్వ మాజీ విప్‌ బాల్క సుమన్‌ పిలుపునిచ్చారు. నవంబర్‌ 29న కరీంనగర్‌ జిల్లా అలుగునూర్‌లో తలపెట్టిన దిక్షాదివస్‌ బహిరంగసభ విజయవంతం కోసం మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన నియోజకవర్గ ముఖ్య నేతల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికా రంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పోరాట స్ఫూర్తిని చాటుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ స్ఫూర్తినితోనే సమాజ సేవ కోసం రాష్ట్ర ప్రగతిలో ముందుకు పోవడానికి పునరంకితం కావాలన్నారు. ఆనాడు మాజీ సీఎం కేసీఆర్‌ను పోలీసులు అరెస్టు చేసిన ప్రాంతంలోనే దీక్షాదివస్‌ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సభకు కేటీఆర్‌ ముఖ్య అతిధి గా హజరువుతున్నట్లు తెలిపారు. కేసీఆర్‌ సచ్చుడో తెలంగాణ వచ్చుడో నని దీక్ష చేపట్టిన కేసీఆర్‌ను పోలీసులు అరెస్టు చేసి ఆసుత్రికి తరలిం చారన్నారు. సమైఖ్యాంద్ర పాలనలో తెలంగాన రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేశారని, కానీ మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ మాత్రం అప్పటి సీఎంలకు అడుగులకు మడుగులు ఒత్తుతూ తెలంగాణ ఆకాంక్ష లేదని, ఉద్యమాన్ని నీరు గార్చేలా ప్రయ త్నించాడని అన్నారు. సీఎంను ఇక్కడకు తీసుకువచ్చి తెలంగాణ ఉద్య మకారులను అణిచివేసే ప్రయత్నం చేసిన మంథని ఎమ్మెల్యే తెలంగాణ ద్రోహి అనే విషయాన్ని గమనించాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇసుక లారీలను ఆపివేస్తామని ప్రకటించిన మంథని ఎమ్మెల్యే ఆనాడు అదే ఇసుక దందాను నడిపిస్తూ మాఫియాకు తెరలేపాడని విమర్శించారు. పెద్దపల్లి పార్ల మెంట్‌ పరిధిలోని మంథని, పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల్లోని బీఆర్‌ఎస్‌ పార్టీశ్రేణులు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి దీక్షాదివస్‌ సభను విజయవంతం చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ స్ఫూర్తిని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, మంథని నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్‌బాబు ప్రోత్సహిస్తున్న మాఫియా దందాలు, రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణను అవమానపరుస్తున్న తీరును నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో సోషల్‌ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లి చర్చ జరిగేలా చేయాలని కోరారు. అల్గునూరులో జరిగే దీక్షా దివస్‌కు మంథని నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులను తరలిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నియో జకవర్గంలోని బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2026 | 12:18 AM