Share News

kumaram bheem asifabad- సర్‌ ప్రక్రియలో భాగస్వాములు కావాలి

ABN , Publish Date - Jul 26 , 2026 | 10:11 PM

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సర్‌ ప్రక్రియలో బీఎల్‌ఏలతో కలిసి, కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు భాగస్వాములు కావాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసినస సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు.

kumaram bheem asifabad- సర్‌ ప్రక్రియలో భాగస్వాములు కావాలి
కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడిని సన్మానిస్తున్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, పాల్గొన్న నాయకులు

జైనూర్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సర్‌ ప్రక్రియలో బీఎల్‌ఏలతో కలిసి, కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు భాగస్వాములు కావాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసినస సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. సర్‌ ప్రక్రియపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ నమోదు ప్రక్రియ పూర్తి చేసుకునేలా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి సహకారం అందించాలన్నారు. అదేవిధంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తల్తెకుండా అవసరమైన మార్గదర్శకత్వం ఇవ్వాలన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేసి కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని కోరారు. మండల స్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ప్రక్రియ పురోగతిని పరిశీలించాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్‌ శ్రేణులందరూ ముందుండాలని ఆమె సూచించారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ పటిష్ఠం కోసం నాయకులు కృషి చేయాలని కోరారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు, సర్పంచుల సంఘం నూతన అధ్యక్షుడు షేక్‌ రషీద్‌, మడావి మనోహర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్‌ అబ్దుల్‌ ముకీద్‌లను డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, పార్టీ నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడిమెత విశ్వనాథ్‌, మాజీ వైస్‌ ఎంపీపీ చిర్లే లక్ష్మణ్‌, సర్పంచులు ఆత్రం అయ్యుబాయి భుజంగ్‌రావ్‌, తొడసం రాజేందర్‌, రాథోడ్‌ రాందాస్‌, డీసీసీ ఎగ్జీక్యూటీవ్‌ మెంబర్‌ పెందుర్‌ ప్రకాష్‌, సీనియర్‌ నాయకులు మేస్రాం అంబాజీ, గేడాం గోపిచంద్‌, సన్‌రైస్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ షేక్‌ జమీల్‌, వసీం, షేక్‌ అబ్బు, రహీం, సుద్దాల శ్రీనివాస్‌, కనక గంగారాం, ఫెరోజ్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2026 | 10:11 PM