Share News

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Oct 06 , 2026 | 11:58 PM

సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని ఎస్‌ఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ హాలులో బ్యాంకర్లకు, గోల్డ్‌ స్మిత్‌ వ్యాపారులతో సమావేశం నిర్వహించారు.

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు

చెన్నూరు, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి) : సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని ఎస్‌ఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ హాలులో బ్యాంకర్లకు, గోల్డ్‌ స్మిత్‌ వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకుల్లో ఎలాంటి మోసాలు జరిగినా పోలీసులకు వెంటనే సమాచారం అందించాలన్నారు. బ్యాంకుల్లో కానీ, వ్యాపార సముదాయాల్లో కానీ ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు అమర్చుకోవాలన్నారు. సీసీ కెమెరాల ద్వారా నేరాలను అట్టే అరికట్టవచ్చన్నారు. గోల్డ్‌ స్మిత్‌ వ్యాపారులు ఎవరైనా అపరిచితులు వ్యక్తులు వచ్చి బంగారం విక్రయించినా, మోసాలకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు సీఐ బన్సీలాల్‌, రూరల్‌ సీఐ కృష్ణ, బ్యాంకుల అధికారృులు, గోల్డ్‌ స్మిత్‌ వ్యాపారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 06 , 2026 | 11:58 PM