Share News

లక్ష సంతకాల ఉద్యమం

ABN , Publish Date - Oct 22 , 2026 | 11:51 PM

ఉమ్మ డి పాలమూరు జిల్లాలో పెం డింగ్‌లోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయా లని జేఏసీ నాయకుడు కానుగుల జంగయ్య డిమాండ్‌ చేశారు.

లక్ష సంతకాల ఉద్యమం
కరపత్రాలతో నిరసన చేస్తున్న ఎర్రవల్లి నిర్వాసితులు

- పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలి

- జేఏసీ నాయకుడు జంగయ్య

కల్వకుర్తి/ చారకొండ, అక్టోబ రు 22 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మ డి పాలమూరు జిల్లాలో పెం డింగ్‌లోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయా లని జేఏసీ నాయకుడు కానుగుల జంగయ్య డిమాండ్‌ చేశారు. పండుగ సాయన్న జయంతి సందర్భంగా గురువారం కల్వకుర్తి పట్టణంలోని జేఏసీ దీక్షా శిబిరం వద్ద లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆ యన మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ఎ త్తిపోతల పథకంతో పాటు పెండింగ్‌ ప్రాజెక్టు లను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందించాలని కోరారు. డిండి ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని, ఈ పథకంతో పాల మూరు రైతులకు అన్యాయం జరిగే ప్రమాద ముందని, ఎర్రవెల్లి గ్రామ ప్రజల అభ్యంతరా లను పరిష్కరించాలని కోరారు. సేకరించిన సం తకాలను ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ రా ష్ట్ర కార్యదర్శి వీరస్వామి మాదిగ, ఎర్రవల్లి ప్రకా శ్‌ పెద్దయ్యగౌడ్‌, అర్జున్‌రెడ్డి, రాజు మా దిగ, రుక్నద్దీన్‌, పర్వతాలుగౌడ్‌ పాల్గొన్నారు.

ఫ చారకొండ మండలం గోకారం రిజర్వా యర్‌ కారణంగా ముంపునకు గురవుతున్న ఎ ర్రవల్లి, ఎర్రవల్లితండా గ్రామాలను కాపాడా లని ఎర్రవల్లి నిర్వాసితుడు ఏకుల ప్రకాశ్‌ అ న్నారు. ఎర్రవల్లిలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో సేవ్‌ ఎర్రవల్లి పేరుతో నిర్వాసితులు చేపట్టిన రి లే నిరాహార దీక్షలు గురువారం 325వ రోజుకు చేరాయి. డిండి ఎత్తి పోతల పథకాన్ని రద్దు చే యాలని పండుగ సాయన్న స్ఫూర్తితో ఆయన జయంతి సందర్భంగా ఉమ్మడి పాలమూరు పెండింగ్‌ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఆధ్వర్యంలో లక్ష సంతకాల సేకరణ ఎర్రవల్లిలో చేపట్టారు. అనంతం పండుగ సాయన్న చిత్రపటానికి పూ ల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్య క్రమంలో గ్రామస్థులు మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2026 | 11:51 PM