Share News

ఒకే శాఖ, ఒకే వేతనం అమలు చేయాలి

ABN , Publish Date - Jan 09 , 2026 | 11:41 PM

రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖలో పని చేస్తున్న అర్చక ఉద్యోగులందరికీ ఒకే శాఖ, ఒకే వేతనం అమలు చేసి వెంటనే చెల్లించాలని అర్చక ఉద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఒకే శాఖ, ఒకే వేతనం అమలు చేయాలి
మాట్లాడుతున్న అర్చక ఉద్యోగ జేఏసీ అధ్యక్షుడు ఉపేంద్రశర్మ

అర్చక ఉద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ

దండేపల్లి జనవరి 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖలో పని చేస్తున్న అర్చక ఉద్యోగులందరికీ ఒకే శాఖ, ఒకే వేతనం అమలు చేసి వెంటనే చెల్లించాలని అర్చక ఉద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండలంలోని గూడెంగుట్ల శ్రీసత్యనారాణస్వామి దేవస్థానంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కమిటీ అర్చక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రాంట్‌ ఎయిడ్‌ ఇన్‌ జీవో నెంబర్‌ 577 ప్రకారం అర్హత ఉన్న 5625 మంది అర్చక ఉద్యోగులకు తక్షణమే గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ వర్తింపజేయాలన్నారు. ప్రస్తుతం 2,622 మందికి మాత్రమే ఈ ప్రయోజనం అందోతుందన్నారు. మిగిలిన వారికి నింబంధనల సాకుతో గ్రాంట్‌ ఇవ్వడం లేదన్నారు. దేవాయాల్లో రెండేఏళ్లు పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌, తాత్కాలిక, దినసరి వేతన ఉద్యోగులకు మానవీయ థృక్పథంతో వారందరికీ రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. వీరికి కూడా ప్రభుత్వ ఇతర శాఖల ఉద్యోగులతో సమానంగా భధ్రత కల్పించాలన్నారు. దేవాదాయ శాఖలో పని చేస్తున్న అధికారులకు జీతభత్యాలు పెన్షన్‌ అందుతున్నాయని ఆదే శాఖలో పని చేస్తున్న అర్చకులకు కూడా అదే సౌకర్యం కల్పించాలన్నారు. అధికారు లకు చెల్లించిన విధంగా అర్చక ఉద్యోగులకు కూడా ట్రెజరీ ద్వారా వేతనం చె ల్లించాలన్నారు. స్పెషల్‌ గ్రేడ్‌ ఇంక్రిమెంట్‌, సరెండర్‌ లీవ్స్‌ మంజూరు చేయట, కారుణ్య నియామకం కాబడిన వారికి ఉద్యోగులకు గ్రాంట్‌ ఎన్‌ ఎయిడ్‌ ద్వారా వేతనాలు అందించాలన్నారు. ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డి మాండ్‌లను వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అర్చక ఉద్యోగుల జేఏసీ కన్వీనర్‌ డీవీఆర్‌ శర్మ, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఉద్యోగు, అర్చక సంఘల అధ్యక్ష కార్యదర్శులు రామణరావు, సంపత్‌స్వామి, ఆలయ ముఖ్య అర్చకులు గోవర్థన రఘస్వామి, ఆలయ సూపరింటెండెంట్‌ బుర్ర శ్రీనివాస్‌ గౌడ్‌, ఉమ్మడి జిల్లాల అర్చకులు, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2026 | 11:41 PM