kumaram bheem asifabad-భారం ఎవరిపై..?
ABN , Publish Date - Aug 12 , 2026 | 11:40 PM
రాష్ట్రంలో వానాకాలం సాగు కీలక దశకు చేరుకున్న తరుణంలో ఎరువుల పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వం కీలక మార్పులు చేస్తూ జీవో ఆర్‌టీ నంబరు 391జారీ చేసింది. పీఏసీఎస్‌లు, వివిధ ప్రభుత్వ పంపిణీ కేంద్రాలకు ఇప్పటి వరకు ఎరువుల రవాణాపై అందజేస్తున్న రావాణా చార్జీల మద్దతును రద్దు చేసింది. ఎరువుల కంపెనీ నుంచి రవాణా పాయింట్లకు, అక్కడి నుంచి పంపిణీ కేంద్రాలకు చేరవేయడానికి అయ్యే ఖర్చును ఇన్ని రోజులు మార్క్‌ఫెడ్ భరించేది. ప్రస్తుతం ఈ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
- పీఏసీఎస్‌లు, ప్రభుత్వ కేంద్రాలకు ఉచిత రవాణా రద్దు
- ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లింపు
బెజ్జూరు, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వానాకాలం సాగు కీలక దశకు చేరుకున్న తరుణంలో ఎరువుల పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వం కీలక మార్పులు చేస్తూ జీవో ఆర్‌టీ నంబరు 391జారీ చేసింది. పీఏసీఎస్‌లు, వివిధ ప్రభుత్వ పంపిణీ కేంద్రాలకు ఇప్పటి వరకు ఎరువుల రవాణాపై అందజేస్తున్న రావాణా చార్జీల మద్దతును రద్దు చేసింది. ఎరువుల కంపెనీ నుంచి రవాణా పాయింట్లకు, అక్కడి నుంచి పంపిణీ కేంద్రాలకు చేరవేయడానికి అయ్యే ఖర్చును ఇన్ని రోజులు మార్క్‌ఫెడ్ భరించేది. ప్రస్తుతం ఈ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రవాణా వ్యయాన్ని ఎవరు భరిస్తారనే అంశం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో పలుచోట్ల ఎరువుల బస్తాపై రవాణా చార్జీల పేరిట రైతుల నుంచి ఎమ్మార్పీ కంటే అదనంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎఫ్‌ఓఎల్ విధానం రద్దు కావడంతో రవాణా వ్యయం భారం రైతులపై పడు తుందని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీ ధరలకే ఎరువులు విక్రయించేలా నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
- వెయిటింగ్ లిస్ట్ విధానం..
తాజా జీవోలో ప్రభుత్వ ఫర్టిలైజర్ యాప్‌లో వెయిటింగ్ విధానాన్ని అమలు చేయాలని స్ప్షష్టం చేసింది. యాప్‌లో నమోదు చేసుకున్నా ఎరువులు అందు బాటులో లేకపోతే సదరు రైతుల పేర్లను వెయిటింగ్ లిస్ట్‌లో నమోదు చేస్తారు. స్టాక్ వచ్చిన వెంటనే రైతులకు మొబైల్ ద్వారా సమాచారం అందజేయనున్నారు. ఈ విధానంతో రైతులు ఎరువులు వచ్చినప్పుడల్లా డీలర్ల వద్దకు పరుగెత్తాల్సిన అవసరం తగ్గుతుందని ఆశిస్తున్నారు. అంతేకాకుండా ఎరువుల కేటాయింపులో మూడెకరాల వరకు భూమి ఉన్న చిన్న రైతులకు పూర్తి కోటాను ఒకేసారి అందిం చాలని నిర్ణయించింది. మూడెకరాలు దాటితే ఇంతకుముందు లాగే ఎరువులు కేటాయించనున్నారు.
- ప్రభుత్వ చర్యలతో..
యూరియా రవాణా చార్జీలను ప్రభుత్వం నిలిపివేయడంతో పీఏసీఎస్‌లు యూ రియా విక్రయించేందుకు వెనుకంజ వేస్తున్నారు. యూరియా దిగుమతికి అవసర మైన రవాణా చార్జీలను ప్రభుత్వమే సంఘాలకు చెల్లించేది. యూరియా దిగుమతి చార్జీలు భరించాల్సిందిగా గత నెల 14న సహకార సంఘాలకు ఉత్తర్వులు అందాయి. దీంతో సంఘాలు అయోమయంలో పడ్డాయి. జిల్లాలో 12 సొసైటీలు ఉండగా, గతంలో పీఏసీ ఎస్‌లో యూరియా బుకింగ్ చేసుకుంటే హమాలీతో కలిపి రూ.280కి అందించేవారు. ప్రస్తుతం రవాణా చార్జీలు రైతులపై మోపితే రూ.300 లకుపైగా అందించాల్సి ఉంటుంది. దీంతో ఈ భారాన్ని మోయలేమని పీఏసీ ఎస్‌లు చేతులెత్తేస్తున్నాయి.
రైతులు చెల్లించవద్దు..
- నాగరాజు, ఏవో బెజ్జూరు
ఎరువులు కొనుగోలు చేసే రైతులు రవాణా చార్జీల పేరిట ఎలాంటి అదనపు మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు. డీలర్లు ఎమ్మార్పీ ధరకే యూరియాను విక్రయించాలి. రైతులు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. అధనంగా వసూలు చేస్తే వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేయాలి.