Share News

అంజనాపురంలో ఏప్రిల్‌కు ‘పామ్‌’ ఫ్యాక్టరీ పూర్తి

ABN , Publish Date - Mar 16 , 2026 | 03:57 AM

ఏప్రిల్‌ నెలాఖరుకల్లా ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీని రైతులకు అందుబాటులోకి తెస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.

అంజనాపురంలో ఏప్రిల్‌కు ‘పామ్‌’ ఫ్యాక్టరీ పూర్తి

  • సీడ్‌ గార్డెనింగ్‌, ఆయిల్‌పామ్‌ పరిశోధనాభివృద్ధి కేంద్రం కూడా

  • సీఎంచే 22న నర్మెట్టలో ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ ప్రారంభం: తుమ్మల

ఖమ్మం/కొణిజర్ల, మార్చి 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఏప్రిల్‌ నెలాఖరుకల్లా ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీని రైతులకు అందుబాటులోకి తెస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురంలో ప్రముఖ కార్పొరేట్‌ సంస్థ గోద్రేజ్‌ నిర్మిస్తున్న ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఫ్యాక్టరీలో ఆయిల్‌పామ్‌ పరిశోధన, అభివృద్ధి కేంద్రం, సీడ్‌ గార్డెనింగ్‌ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సీడ్‌ గార్డెనింగ్‌ ఏర్పాటుకు అవసరమైన స్థలం కేటాయింపునకు రైతులను ఒప్పించాలని అధికారులకు సూచించారు. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఈ నెల 22న ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు.

Updated Date - Mar 16 , 2026 | 03:57 AM