Share News

ఆయిల్‌పామ్‌ టన్ను గెలల ధర రూ.23,852

ABN , Publish Date - Jun 02 , 2026 | 04:48 AM

రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. టన్ను గెలల ధర రూ.23,852కు చేరినట్లు టీఎస్‌ ఆయిల్‌ఫెడ్‌ అధికారులు సోమవారం ప్రకటించారు.

ఆయిల్‌పామ్‌ టన్ను గెలల ధర రూ.23,852

అశ్వారావుపేట, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. టన్ను గెలల ధర రూ.23,852కు చేరినట్లు టీఎస్‌ ఆయిల్‌ఫెడ్‌ అధికారులు సోమవారం ప్రకటించారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా.. ఆయిల్‌పామ్‌ గెలల ధరలు ప్రతినెలా పెరుగుతూ రికార్డులను అధిగమిస్తోంది. గతనెల ధర కంటే ఈ నెల టన్నుకు రూ.351 మేర పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, ఉద్యాన శాఖ, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషితో ఆయిల్‌పామ్‌ గెలల ధరలు రైతులకు ఆశాజనకంగా మారింది. గతేడాది డిసెంబరు నుంచి వరుసగా పెరుగుతూ వస్తున్న ఆయిల్‌పామ్‌ గెలల ధర.. ఆరు నెలల్లో టన్నుకు రూ.3,888 పెరిగింది. దీంతో ఆయిల్‌పామ్‌ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 02 , 2026 | 04:48 AM