అయ్యో పాపం మూగజీవాలు...!
ABN , Publish Date - Apr 20 , 2026 | 11:42 PM
వణ్య ప్రాణుల కోసం వేటగాళ్లు, అడవి పం దుల బారి నుంచి పంటను కాపాడుకునేం దు కు కొందరు రైతులు కొత్త పుంతలు తొక్కు తున్నారు. అవసరమైతే వాటి ప్రాణాలు తీయ డం ద్వారానైనా తమ లక్ష్యాన్ని నెరవేర్చుకుం టున్నారు.
-మందు గుళ్లకు బలవుతున్న పశువులు
-పంట రక్షణ, వణ్యప్రాణుల వేట కోసం వినియోగం
-అమ్మోనియాతో తయారవుతున్న పేలుడు పదార్థాలు
మంచిర్యాల, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): వణ్య ప్రాణుల కోసం వేటగాళ్లు, అడవి పం దుల బారి నుంచి పంటను కాపాడుకునేం దు కు కొందరు రైతులు కొత్త పుంతలు తొక్కు తున్నారు. అవసరమైతే వాటి ప్రాణాలు తీయ డం ద్వారానైనా తమ లక్ష్యాన్ని నెరవేర్చుకుం టున్నారు. ఆ చర్యల వల్ల ఇతర మూగ జీవా లకు పెను ముప్పు వాటిళ్లుతున్నది. ఇప్పటి దాకా పంటల చుట్టూ తీగలు అమర్చి, రాత్రి వేళల్లో వాటికి విద్యుత్ ప్రసారం చేయడం ద్వారా వణ్య ప్రాణులు పొలాల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకునే వారు. చేను చుట్టూ అమర్చిన విద్యుత్ తీగలకు అడవి పందులు ప్రాణాలు కోల్పోతాయి గనుక పంట నష్టం వా టిల్లదనే భావనలో రైతులు ఉండేవారు. అయి తే అవే విద్యుత్ తీగలకు తగిలి మను షులు మృత్యువాత పడ్డ సంఘటనలు జిల్లాలో కోకొ ల్లలుగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో విద్యు త్ తీగలు అమర్చిన రైతులే వాటికి తగిలి మరణించిన దాఖలాలు కూడా ఉన్నాయి.
యథేశ్చగా పేలుడు పదార్థాల వినియోగం....
వణ్య ప్రాణుల వేట, అడవి పందుల బారి నుంచి పంటలను కాపాడుకునేందుకు గుర్తు తెలియని వ్యక్తులు కొందరు యథేశ్చగా పే లుడు పదార్థాలు వినియోగిస్తున్న సందర్భా లు అనేకం వెలుగు చూస్తున్నాయి. పత్తి, వరి పొలాల వద్ద వణ్య మృగాలు సంచరించే దారి లో పేలుడు పదార్థాలు ఉంచుతున్నారు. 2022 ఏప్రిల్ 2వ తేదీన పాత మంచిర్యాలకు నివాసి బండారి సంతోష్‌కు చెందిన ఓ బర్రె గోదావరి ఒడ్డున మేతకు వెళ్లి పొరపాటున పేలుడు ప దార్థం తినగా అది పేలి దాని నోరు భాగం తునా తునకలైంది. (అనంతరం బర్రె చనిపో యింది). తాజాగా జన్నారం మండలం బాదం పల్లి గ్రామ సమీపంలో గోదావరి నది ఒడ్డున ఆది వారం పేలుడు సంభవించి ఓ బర్రె తీవ్రంగా గాయపడింది. అక్కడ వణ్యప్రాణు లను వేటా డేందుకు గుర్తు తెలియని వ్యక్తులు పేలుడు పదార్థాలు అమర్చినట్లు తెలుస్తోంది. గ్రామా నికి చెందిన పశువుల కాపర్లు తమ బర్రెలను మేతకు తీసుకెళ్లగా అవి మేస్తుండగా ఒక్క సా రిగా పేలుళ్లు సంభవించాయి. అదే ప్రాం తంలో పేలుళ్ల దాటికి నాలుగు రోజుల క్రితం నాలుగు మేకలు మృతి చెందినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.
వణ్య ప్రాణులను హతమార్చడమే లక్ష్యంగా....
పాత మంచిర్యాల గోదావరి సమీపంలో పేలుడు సంభవించిన ప్రాంతంలో అడవి పం దులతో పాటు జింకలు, కుందేళ్లు కూడా అనే కం ఉన్నాయి. నదిలో నీరు ఉన్నందున దా హం తీర్చుకునేందుకు అవి తరుచుగా అక్కడి కి వస్తుంటాయి. దీంతో వేటగాళ్లే వాటిని హ తమార్చేందుకు మందు గుండు ప్రయోగం చేశారనే అభిప్రాయాలు ఉన్నాయి. గతంలో అనేక మార్లు ఆ ప్రాంతంలో వణ్య ప్రాణుల వేట కోసం ఉర్లు అమర్చేవారు. ఉర్లలో చిక్కు కుని అడవి పందులు, ఇతర వణ్యప్రాణులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలూ ఉన్నాయి. అయితే పొరపాటున మందు గుండు ఉన్న పదార్థాన్ని మనుషులు తొక్కి ఉంటే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్న మవుతున్నాయి.
చట్టం ఏం చెబుతోంది...
పంటలకు నష్టం కలిగించే అడవి పందుల నిర్మూలనకు వణ్యప్రాణి చట్టంలో ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించింది. అడవి పం దుల బెడద ఉన్న చోట గ్రామ సర్పంచు స మక్షంలో రైతులు వాటిని హతమార్చడానికి తీర్మాణం చేయాలి. అనంతరం అటవీ అధికా రులకు సమాచారం ఇవ్వాలి. ప్రభుత్వం అడవి పందులను కాల్చివేసేందుకు నిపుణులైన షూ టర్లను ఏర్పాటు చేస్తుంది. షూటింగ్ ప్రాంతా నికి ప్రజలు వెళ్లకుండా ముందు రోజు గ్రా మంలో టాంటాం చేయించాలి. షూటింగులో మనుషుల ప్రాణాలకు ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు చేపట్టాలి. అంతేగాని నేరుగా ప్రజ లే అడవి పందులను హతమార్చడం వణ్య ప్రాణి చట్టం ప్రకారం నేరం. దీన్ని అతిక్రమిం చిన వారిపై వణ్యప్రాణి చట్టం ప్రకారం కఠి నమైన చర్యలు ఉంటాయి. జన్నారంలో జరిగి న సంఘ టనపై అక్కడి పోలీసులు కేసు న మోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుప గా, దాదాపు మూడేళ్ల క్రితం పాత మంచిర్యాల సమీపంలో జరిగిన పేలుడుకు సంబంధించి విచారణ ముందుకు సాగకపోవడం గమనార్హం. బాధిత రైతు అటవీ అఽధికారులకు సమాచారం ఇచ్చిన ట్లు చెబుతున్నా...ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఎవరి కూడా తెలియదనే సమా ధానాలు వినిపిస్తున్నాయి.