kumaram bheem asifabad- అధికారులు లక్ష్యం కోసం శ్రమించాలి
ABN , Publish Date - Feb 24 , 2026 | 10:52 PM
మండలంలో సంపూర్ణత అభియాన్ 2.0లో లక్ష్యం చేరుకునేందుకు అధికారులు సమష్టిగా శ్రమించాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. మండలంలో సంపూర్ణత అభియాన్ 2. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ డేవిడ్ హాజరయ్యారు.
తిర్యాణి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): మండలంలో సంపూర్ణత అభియాన్ 2.0లో లక్ష్యం చేరుకునేందుకు అధికారులు సమష్టిగా శ్రమించాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. మండలంలో సంపూర్ణత అభియాన్ 2. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ డేవిడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంపూర్ణత అభ్యాస్ 2.0లో పుట్టిన బిడ్డ బరువు, పీహెచ్‌సీసీహెచ్‌సీ పై ప్రత్యేక శ్రద్ధ అంగన్‌వాడీలో ఎత్తుల కొలతలు, మరుగుదొడ్లు నిర్వహణ అంగన్‌వాడీలు అందించే పౌష్టికాహారం, పశువుల టీకాలు, తదితర అంశాలతో ఇండికేటర్లు ఉండనున్నట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమష్టిగా పని చేసినప్పుడే లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. గత సంపూర్ణత అభ్యాస్ 1.0ల ఏ విధంగానైతే కలిసి కట్టుగా రాణించి దేశంలో నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టారన్నారు. ఇప్పుడు కూడా అదే వివధంగా కృషి చేయాలని కోరారు. గ్రామాల్లో మరుగుదొడ్ల వాడకాలు పెరిగి గ్రామాలు అన్ని పరిశుభ్రంగా మారాయని అభినందించారు. సమైక్య సంఘాల నుంచి గ్రామాల అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు అద్భుతంగా పని చేస్తున్నారని అన్నారు. వ్యవసాయ, పశు సంపద, నీటి వనరులు తదితర అంశాలను కేంద్రీకృతం చేసి ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో దత్తుమూర్తి, జిల్లా వ్యవసాయాధికారి వెంకట్, తహసీల్దార్ శ్రీనివాస్, డాక్టర్ పల్లవీ, సీడీపీవో తిరుపతమ్మ, ఎంఈవో అంజయ్య, ఏవో వినయ్, ఎంపీవో ప్రశాంత్, ప్రోగ్రాం ఆర్గనైజర్ బాలరాజ్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, సర్పంచ్‌లు, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.