kumaram bheem asifabad- అధికారులు సమన్వయంతో పని చేయాలి
ABN , Publish Date - May 19 , 2026 | 10:22 PM
జిల్లా అభివృద్ధికి అధికారులు సమన్వ యంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల వీసీ హాల్‌లో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్‌తో కలిసి ప్రభుత్వ శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్, మే 19 (ఆంధ్రజ్యోతి): జిల్లా అభివృద్ధికి అధికారులు సమన్వ యంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల వీసీ హాల్‌లో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్‌తో కలిసి ప్రభుత్వ శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 12వ తేదీన విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అన్ని యజమాన్యాల పరిధిలోని పాఠశాలలు, ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పూర్తి చేయాలని తెలిపారు. తాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, బాలికలకు ప్రత్యేక మూత్రశాలల నిర్మాణ పనులు పూర్తి చేయాలని, పాఠశాలలు ప్రారంభం రోజునే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వర్షాలు ప్రారంభమయ్యేలోపు ఇంజనీరింగ్ శాఖల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, భవనాల నిర్మాణాలు, వంతెనల పనులు, ఇతర మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ప్రతి మారు మూల గ్రామాలకు తాగునీరు అందించాలని, పైప్‌లైన్ మరమ్మతులు పూర్తి చేసి ప్రతి రోజు నీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ పనులు, సమస్యలపై వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించి దరఖాస్తుదారులకు భరోసా కల్పించాలన్నారు. యాసంగి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని, అధికారులు ప్రతి రోజు తమ పరిధిలోని కొనుగోలు కేంద్రాలను సందర్శించి ప్రశాంతంగా జరిగేలా పర్యవేక్షించాలన్నారు. శాఖల వారీగా అభివృద్ధి పనుల పురోగతి, ఇతర కార్యక్రమాల వివరాలను నివేదికను అందించాలని సూచించారు.కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
పారదర్శకంగా ఖాళీల భర్తీ.
జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వ ర్యంలో జిల్లా కేంద్రంలోని సఖీ కేంద్రంలో ఖాళీలను పొరుగు సేవల ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఇంటర్వ్యూలు పారదర్శకంగా నిర్వహించనున్నామని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన ఇంటర్వ్యూలకు కమిటీ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని సఖీ కేంద్రంలో పొరుగు సేవల ప్రాతిపదికన పని చేసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కు ఇంటర్వ్యూ లు నిర్వహించి ప్రతిభ ఆధారంగా భర్తీ చేయనున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి స్వరూపారాణి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.