అధికారులు పకడ్బందీగా విధులు నిర్వహించాలి
ABN , Publish Date - Jan 23 , 2026 | 11:14 PM
రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో అధికారులకు అం దిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకుని పకడ్బందీగా విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు.
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి) : రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో అధికారులకు అం దిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకుని పకడ్బందీగా విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శుక్రవారం సమీకృత కలె క్టరేట్ భవన సమావేశ మందిరంలో ప్రత్యేక ఎన్నికల అధికారి శంకర్‌తో కలిసి రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజ రయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ము న్సిపల్ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పా త్ర కీలకమైందన్నారు. ఎన్నికల ప్రక్రియ నామినేషన్ ద శ నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వరకు ఎన్ని కల కమిషన్ మార్గదర్శకాలు, రిటర్నింగ్ హ్యాండ్‌బుక్ ప్ర కారం పారదర్శకంగా విధులు నిర్వహించాలన్నారు. శిక్ష ణలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పరిపాలన వ్యవస్థ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియా మకం, విధులు, ఎన్నికల సామగ్రి లభ్యత, పంపిణీ, ఎ న్నికల నోటిఫికేషన్ జారీ, తుది జాబితా ప్రచురణ, ఎ న్నికల గుర్తుల కేటాయింపు, పోలింగ్ ఏర్పాట్లు, పోలిం గ్ రోజు విధులు, బ్యాలెట్‌బాక్సులమూసివేత, ఓట్ల లె క్కింపు, ఫలితాలు, ఎన్నికల ఖర్చుల పరిశీలనపై సమగ్ర అవగాహన కల్పిస్తారన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించాలని, హెల్ప్ డె స్క్‌ను ఏర్పాటు చేయాలని తెలిపారు. మున్సిపల్ కమి షనర్‌లతో సమన్వయం పాటిస్తూ చెక్ లిస్టును తప్పనిస రిగా అనుసరించాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా శిక్ష అందించాలని అధికారు లకు సూచించారు. ఎన్నికల నిర్వహణ సమయంలో సై తం సంబంధిత శాఖల పనులు యధావిధిగా కొనసా గుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధి కారులు పాల్గొన్నారు.