kumaram bheem asifabad- గ్రామసభల్లో అధికారులు పాల్గొనాలి
ABN , Publish Date - Mar 30 , 2026 | 10:17 PM
జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా 2వ తేదీన నిర్వహించే గ్రామసభలకు సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని కలెక్టర్ కె హరిత అన్నారు. సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన సమావేశానికి అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడతూ ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికా కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2న ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామసభలు నిర్వహించాలన్నారు.
ఆసిఫాబాద్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా 2వ తేదీన నిర్వహించే గ్రామసభలకు సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని కలెక్టర్ కె హరిత అన్నారు. సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన సమావేశానికి అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడతూ ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికా కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2న ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామసభలు నిర్వహించాలన్నారు. సర్పంచ్‌ల అధ్యక్షతన నిర్వహించే గ్రామసభల్లో సంబంధిత శాఖల అధికారులు పాల్గొనాలని సూచించారు. గ్రామసభలో వచ్చే వివిధ సమస్యలపై వెంటనే స్పందించాలన్నారు. గ్రామ సభ నిర్వహించే ప్రదేశాల్లో అవసరమైన షామియానాలు, తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. గ్రామసభలను విజయవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు.
రుణాలు సద్వినియోగం చేసుకోవాలి
ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వం అందించే రుణాలను సద్వినియోగం చేసుకొని జీవనోపాధిని మెరుగు పర్చుకోవాలని కలెక్టర్ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో ముగ్గురు ట్రాన్స్‌జెండర్లకు ఈఆర్‌ఎస్ పథకం కింద మంజూరైన రుణాల చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీడబ్ల్యూఓ భాస్కర్, సెక్షన్ ఆఫీసర్ రవి తదితరులు పాల్గొన్నారు.
పారదర్శకంగా ఇసుక సరఫరా
ప్రభుత్వ వెబ్‌సైట్, మొబైల్ యాప్ మన ఇసుక వాహనం’ ద్వారా పారదర్శకంగా ఇసుక సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ హరిత అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్, మండల అభివృద్ధి, జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి, టీబీఎండీసీ అధికారి వెంకటేశ్‌వర్లు, భూగర్భ గనుల శాఖ ఏడీ గంగాధర్, భూగర్భ జలాల శాఖ ఏడీ సుహాసినితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ వినియోగదారులకు నిర్దేశిత ధరతో పార్దర్శకంగా ఇసుక సరఫరా చేసేందుకు మన ఇసుక వాహనం యాప్ రూపొందిం చిందని చెప్పారు. వినియోగదారులు ఈ యాప్ ద్వారా ఇసుక బుక్ చేసుకుని దళారుల జ్యోం లేకుండా ఇసుక పొందవచ్చని తెలిపారు. సమావేశంలో జిల్లాలోని సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.