Share News

kumaram bheem asifabad- అధికారులు అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - May 15 , 2026 | 10:09 PM

వర్షాకాలంలో వరదలు విపత్తుల వల్లా ఆస్తులు, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. శుక్రవారం సమీతకృత కలెక్టరేట్‌ భవన సముదాయంలోని వీసీ హాల్‌లో జాతీయ విపత్తుల నివారణ సంస్థ అధికారులు న్యూఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, కాగజ్‌నగర్‌ డివిజన్‌ అధికారి అప్పయ్యతో కలిసి కలెక్టర్‌ హాజరయ్యారు.

kumaram bheem asifabad- అధికారులు అప్రమత్తంగా ఉండాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ హరిత, అదనపు కలెక్టర్‌ డేవిడ్‌

ఆసిఫాబాద్‌, మే 15 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలంలో వరదలు విపత్తుల వల్లా ఆస్తులు, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. శుక్రవారం సమీతకృత కలెక్టరేట్‌ భవన సముదాయంలోని వీసీ హాల్‌లో జాతీయ విపత్తుల నివారణ సంస్థ అధికారులు న్యూఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, కాగజ్‌నగర్‌ డివిజన్‌ అధికారి అప్పయ్యతో కలిసి కలెక్టర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వరదలు, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ, అతి భారి వర్షాలు కురిసే సమయంలో వరదలు వచ్చిన జనవననం స్తంభించి పోతుందని ఆ సమయంలో ప్రజలను రక్షించి వారికి పునరావాసం ఏర్పాట్లు చేపట్టాలన్నారు. జిల్లాలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని అన్నారు. వరదలు వచ్చే సమయంలో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. జిల్లాలో విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను రక్షించడానికి రెస్క్యూ టీంలు సిద్ధంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి ఆహారం, తాగునీరు, వైద్య చికిత్సలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు, అగ్నిమాపక, నీటి పారరుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఆసిఫాబాద్‌రూరల్‌, (ఆంధ్రజ్యోతి): యువత పుస్తకాలు చదవడం తప్పని సరిగా అలవర్చుకోవాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు జిల్లాకేంద్రం గ్రంథాలయంలో విద్యావారో త్సవాల్లో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన గ్రంథాలయ దినోత్సవ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అనిల్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీఈవో లలితతో కలిసి కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన భాండగారాలు అని అన్నారు. గ్రంథాయాలకు నేటి యువత తప్పని సరిగా రావాలన్నారు. గ్రంథాలయాలలో ఎన్నో నవలలు, చరిత్రకు సంబంధించిన పుస్తకాలు గొప్ప వారి చరిత్ర కు సంబంధించినవి అందుబాటులో ఉంటాయన్నారు. ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే అభ్యర్థులకు గ్రంథాలయాలు చక్కని వేదిక అని అన్నారు. గ్రంథాలయాల అభివృద్ధికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా గ్రంథాల యంలో చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారిని, కవులను శాలువాలతో కలెక్టర్‌ సన్మానించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2026 | 10:09 PM