ఆలయ అభివృద్ధి పనులను అడ్డుకున్న అధికారులు
ABN , Publish Date - Jul 19 , 2026 | 11:23 PM
పదర మండల కేంద్రంలో మద్దిమ డుగు గ్రామం పబ్బతి ఆంజనేయ స్వామి కోట మైసమ్మ ఆలయం ముందు దేవాదాయ శాఖ ఆధ్వర్యం లో గుడిగోపురం నిర్మాణ పనులు చే స్తున్న సమయంలో ఆదివారం అట వీశాఖ అధికారులు ఎఫ్‌డీవో రా మ్మూర్తి సిబ్బందితో వెళ్లి పనులన అ డ్డుకున్నారు.
పదర, జూలై 19 (ఆంధ్రజ్యోతి) : పదర మండల కేంద్రంలో మద్దిమ డుగు గ్రామం పబ్బతి ఆంజనేయ స్వామి కోట మైసమ్మ ఆలయం ముందు దేవాదాయ శాఖ ఆధ్వర్యం లో గుడిగోపురం నిర్మాణ పనులు చే స్తున్న సమయంలో ఆదివారం అట వీశాఖ అధికారులు ఎఫ్‌డీవో రా మ్మూర్తి సిబ్బందితో వెళ్లి పనులన అ డ్డుకున్నారు. గుడిగోపురం నిర్మాణం చేసే భూమి అటవీశాఖ పరిధిలో ఉందనే ఆలయ అధికారులకు వారు సూచించారు. అటవీశాఖ అనుమతు లు తీసుకుని తర్వాతనే పనులను చేపట్టాలని ఆలయ అధికారులకు సూచించారు. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంలో మద్దిమడుగు చై ర్మన్ రాములు, ఆలయ అధికారులు, సర్పంచ్‌లు గేమానాయక్, ఆంజనే యులు, భాస్కర్ ఉన్నారు.