అధికారుల నిర్లక్ష్యం....కార్మికులకు శాపం
ABN , Publish Date - Jul 28 , 2026 | 11:36 PM
వారంతా మంచిర్యాల మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో వి విధ విభాగాల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ కా ర్మికులు. చాలీచాలని జీతాలతో రెక్కాడితేగానీ... డొ క్కాడని బడుగు జీవులు...అష్టకష్టాలు పడి కు టుంబాలను సాకుతూ జీవితం అనే బండిని లా క్కొస్తున్న శ్రామికులు. నగరంలో పారిశుధ్య పను లు మొదలుకొని విద్యుద్ధీకరణ, ఆఫీస్ సబార్డినేట్, వాటర్ సప్లై, డ్రైవర్ వరకు విధులు నిర్వహి స్తుం టారు.
ఎనిమిదేళ్లుగా ఈఎస్‌ఐ చెల్లింపులు నిలిపివేత
ఆందోళనలో మునిసిపల్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది
ఇన్సూరెన్స్ వర్తించక జీవితాలు అంధకారం
మంచిర్యాల కార్పొరేషన్‌లో వెలుగు చూసిన ఘటన
మంచిర్యాల, జూలై 28 (ఆంధ్రజ్యోతి): వారంతా మంచిర్యాల మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో వి విధ విభాగాల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ కా ర్మికులు. చాలీచాలని జీతాలతో రెక్కాడితేగానీ... డొ క్కాడని బడుగు జీవులు...అష్టకష్టాలు పడి కు టుంబాలను సాకుతూ జీవితం అనే బండిని లా క్కొస్తున్న శ్రామికులు. నగరంలో పారిశుధ్య పను లు మొదలుకొని విద్యుద్ధీకరణ, ఆఫీస్ సబార్డినేట్, వాటర్ సప్లై, డ్రైవర్ వరకు విధులు నిర్వహి స్తుం టారు. ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియ నిదిన దినగండంగా బతుకును లాక్కొస్తున్నారు. అటువంటి అత్యంత పేదరికం అనుభవిస్తున్న కా ర్మికులకు అండగా ఉండాల్సిన అధికారులు....వారి జీవితాలనే ఫణంగా పెట్టిన అత్యంత దయనీయ సంఘటన వెలుగు చూసింది. కార్మికులు ఆనారో గ్యం పాలైనా, ప్రమాదాలకు గురైనా నయా పైసా చెల్లించకుండా ఉచితంగా వైద్య చికిత్స పొందేం దుకు ప్రభుత్వాలు ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్‌ఐ) పథకం అమలు చేస్తున్నాయి. పథకం లో భాగంగా ఉద్యోగి నెల జీతం నుంచి కొంత మొ త్తం పథకం కోసం చెల్లించాల్సి ఉండగా, అంతకు మూడు రెట్లు మునిసిపాలిటీ వారి ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. అయితే కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఏళ్ల తరబడి నెలవారీ చెల్లిం పులు జరుగక కార్మికుల ఈఎస్‌ఐ కార్డులన్నీ అ మలులో లేకుండా పోయాయి.
పథకం అమలు ఇలా....
వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థ లు, సంఘటిత రంగాల్లో పని చేస్తూ నెలవారీ వే తనం రూ. 21వేల లోపు ఉన్న కార్మికులు, ఉద్యో గులంతా ఈఎస్‌ఐ పథకంలో చేరేందుకు అర్హులు. వారికి ఈఎస్‌ఐ ఆసుపత్రిలో అనారోగ్యానికి గురైతే పూర్తి ఉచితంగా వైద్య చికిత్సతోపాటు మందులు అందజేయడం, మహిళలకు మెటర్నిటీ సౌకర్యం త దితర అపరిమిత సేవలు అందుతాయి. దీని కో సం జిల్లా కేంధ్రంలోని ఏసీసీ వద్ద ప్రభుత్వ ప రంగా ఈఎస్‌ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ప్ర స్తుతం ఇక్కడ డిస్పెన్సరీ స్థాయిలో (ఓపీ విభా గం) చికిత్స అందుతుండగా, అవసరమైన పక్షంలో హైద్రాబాద్‌లోని నాచారంలోగల ఈఎస్‌ఐ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో సైతం ఉచిత చికిత్సలు అందుతాయి. అంతేగాకుండా నగరంలోని సనత్‌న గర్‌లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఆజమాయిషీలో పని చేస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి సైతం తర లించే వెసులుబాటు ఉంది. అక్కడ కూడా సరి యైన చికిత్స అందని పక్షంలో హైద్రాబాద్‌లోని కా ర్పొరేట్ ఆసుపత్రుల్లో చేర్పించి, పూర్తిస్థాయి చికిత్స అందేలా ఈఎస్‌ఐ అధికారులు చర్యలు చేపడ తా రు. ఈ వెసులుబాటు సైతం పూర్తి ఉచితంగా కా ర్మికుడు కలిగి ఉంటాడు. సాధారణ బీపీ, షుగర్ చికిత్సతోపాటు చిన్నపాటి జ్వరం మొదలుకొని లి వర్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్ర చికిత్స వరకు అ పరిమిత సేవలు పూర్తి ఉచితంగా పొందగలిగే అ వకాశం ఐపీ (ఇన్సూర్డ్ పర్సన్) నెంబర్‌తో కూడిన ఈఎస్‌ఐ కార్డు కలిగి ఉన్న కార్మికులకు ఉంది. ఇం దు కోసం వారి నెలవారీ వేతనంపై 0.75 శాతం కార్మికులు చెల్లించాల్సి ఉండగా, మరో 3.25 శాతం యాజమాన్యాలు తమ వాటా కింద భరించాల్సి ఉంటుంది. అంటే రూ. 21వేల వేతనం పొందుతు న్న కార్మికుడు నెలకు గరిష్టంగా రూ. 157 చెల్లిం చాల్సి ఉండగా, రూ. 680 వరకు యాజమాన్యా లు చెల్లిస్తే సరిపోతుంది (ఆ మొత్తం కూడా కార్మి కుల వేతనాల్లో నుంచే మినహాయింపు చేస్తారు). అలా కార్మికుడు, యాజమాన్యం వంతు మొత్తాన్ని కార్యాలయ నిర్వాహకులు కార్మికుల పేరిట క్రమం తప్పకుండా ఈఎస్‌ఐకి చెల్లింపులు చేయాల్సి ఉం టుంది. అప్పుడే కార్డు యాక్టివ్‌గా ఉండి పై లాభా లు కార్మికులకు సక్రమంగా అందుతాయి.
ఎనిమిదేళ్లుగా పెండింగ్....
మంచిర్యాల మునిసిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 513 మంది ఔట్ సోర్సింగ్ కార్మికులు పని చేస్తుం డగా, వారిలో 132 మందికి సంబంఽధించిన ఈఎస్ ఐ చెల్లింపులు ఏమిదేళ్లుగా నిలిచిపోయాయి. గతం లో నస్పూర్ మునిసిపాలిటీ ప్రత్యేకంగా ఉన్న స మయంలో అక్కడ విధులు నిర్వహించే 132 మంది కార్మికులకు అప్పటి అధికారులు ఈఎస్‌ఐ చెల్లింపులు చేయలేదు. దీంతో వారంతా ఈఎస్‌ఐ సేవలు పొందేందుకు అనర్హులుగా మారారు. కా ర్మికులకు సంబంధించి 2018 నుంచి చెల్లింపులు నిలిచిపోయాయి. దాదాపు రూ. 1.33 కోట్లు చెల్లిం పులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే తమ నెలవా రీ వేతనాల్లో నుంచి సంబంధిత అధికారులు ఈ ఎస్‌ఐ పేరిట కోత విధించినట్లు కొందరు కార్మికు లు చెబుతుండటం గమనార్హం. ఒకవేళ ఈఎస్‌ఐ చెల్లింపులు చేయని పక్షంలో పూర్తి వేతనం అంద జేయాల్సి ఉండగా, కార్మికులు తమకు అందలేదని వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా 132 మంది ఔట్ సోర్సింగ్ కార్మికుల జీవితాలు అంధకారంలోకి వెళ్లాయి. ఆ ఎనిమిదేళ్ల కాలంలో అనేక మంది కార్మికులు ఆనారోగ్యం పాలైనన్పటికీ ఈఎస్‌ఐ సేవలు అందకుండా పోయినట్లు తెలు స్తోంది. పెద్ద ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలకు గు రైనప్పుడు ఆస్పత్రి బిల్లుల కోసం అప్పులు చేసిన ట్లు కొందరు బాధితులు తెలిపారు. కాగా నస్పూర్ మునిసిపాలిటీ మంచిర్యాల కార్పొరేషన్‌లో విలీనం అయిన తరువాత అధికారులు కార్మికుల ఈఎస్‌ఐ చెల్లింపులను సరి చూడగా, నస్పూర్‌లో పని చేస్తు న్న కార్మికుల ఈఎస్‌ఐతోపాటు ఈపీఎఫ్ డబ్బులు కూడా జమకావడం లేదన్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కార్పొరేషన్ అధికారులు హడావు డిగా గత మే నెలలో రెండు ఈఎస్‌ఐ, ఈపీఎఫ్ పథకాలకు బకాయిపడ్డ రూ. 1.33 కోట్ల విలువైన చెక్కును కరీంనగర్‌లోని ఈపీఎఫ్ కార్యాలయ అధి కారులకు అందజేశారు. ఆ నగదుకు సంబంధించి న వడ్డీ ఇంకా చెల్లించాల్సి ఉందని కమిషనర్ జి అన్వేష్ తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కార్మికులు ఈజీఎస్, ఈపీఎఫ్ సేవలకు దూరం కావలసిన పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి బాఽధ్యు లైన అధికారులపై జిల్లా ఉన్నతాధికారులు కఠిన చర్యలు చేపట్టాలన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.