kumaram bheem asifabad-అధికారులు సమన్వయంతో పని చేయాలి
ABN , Publish Date - Nov 10 , 2026 | 10:35 PM
: అభివృదిఽ్ధ పనులు, వివిధ సమస్యలను పరిష్కారించేందకు అధికారులు సమన్వయంతో పని చేయాలని డీపీవో, మండల ప్రత్యేక అధికారి భిక్షపతి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మండల స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల స్థాయి అదికారులు శాఖల పని తీరు, మండల పరిధిలో చేపట్టిన అమలు అవుతున్న సంక్షస్త్రమ పథకాల వివరాలను సర్పంచ్‌లకు తెలిపారు.
రెబ్బెన, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): అభివృదిఽ్ధ పనులు, వివిధ సమస్యలను పరిష్కారించేందకు అధికారులు సమన్వయంతో పని చేయాలని డీపీవో, మండల ప్రత్యేక అధికారి భిక్షపతి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మండల స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల స్థాయి అదికారులు శాఖల పని తీరు, మండల పరిధిలో చేపట్టిన అమలు అవుతున్న సంక్షస్త్రమ పథకాల వివరాలను సర్పంచ్‌లకు తెలిపారు. వీబీజీరామ్‌జీ పథకం కింద 17 అంగన్వాడి కేంద్రాలకు పక్కా భవనాల నిర్మించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పీఏసీఎస్ డైరెక్టర్ సంజీవ్ మాట్లాడుతూ రెబ్బెన సెరిగ్రేషన్ షెడ్డు అందుబాటులో ఉన్న దారి సౌకర్యం లేక పోవడంతో నిరుపయోగంగాఉందని సభా దృష్టికి తెచ్చారు. నారాయణపూర్‌లో విద్యుత్ సమస్యలో మోటార్లు కాలిపోతున్నట్టు వివరించారు. కైరిగూడ సర్పంచ్ రూపేశ్వర్ మాట్లాడుతూ ఎడవెల్లిలో విద్యుత్ స్తంభం విరిగి ఉందని దాని స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయాలన్నారు. రెబెబ్న సర్పంచ్ భరద్వాజ్ మాట్లాడుతూ పశువైద్యశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరకున్నదని చర్యలు చేపట్టాలని చెప్పారు. కొమురెల్లి సర్పంచ్ సాగర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న ఊర చెరువుల స్థలాన్ని కొంత మంది కబ్జా చేయడంతో చెరువుల్లో సామార్థ్యం నీరు నిల్వక పంటలకు సరిపడా నీరు అందడం లేదన్నారు. అలాగే రెవెన్యూ అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని తెలిపారు. గంగాపూర్ సర్పంచ్ వెంకటేశం చారి మాట్లాడుతూ గంగాపూర్ బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి ఏటా లక్షల్లో ఆదాయం వస్తునన్నదని, నిధులు దేనికి ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. లెక్కలను పక్కాగా తేల్చాని సభా దృష్టికి తెచ్చారు. అలాగే మండల స్థాయి అధికారులు ప్రతి సమావేశానికి హాజరయ్యేట్టు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రెబ్బెన గోలేటిలో బొగ్గులారీలపై టార్పాలిన్ వేయక పోవడంతో బొగ్గుచూరతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, తగిన చర్యలు చేపట్టాలని పలువురు పేర్కొన్నారు. ఈ సందర్బంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.