Share News

kumaram bheem asifabad- అధికారులు సమన్వయంతో పని చేయాలి

ABN , Publish Date - Sep 15 , 2026 | 11:18 PM

జిల్లాలో బాల్య వివాహల నివారణకు లైంగిక నేరాల నుంచి బాలలను రక్షించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో సంబందితశాఖల అధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిషన్‌ వాత్సాల్య కార్యక్రమం కింద బాల్య వివాహల నిషేధిత చట్టం పోక్సో చట్టాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. బాల్య వివాహల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

kumaram bheem asifabad- అధికారులు సమన్వయంతో పని చేయాలి
పోస్టర్లను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ హరిత

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బాల్య వివాహల నివారణకు లైంగిక నేరాల నుంచి బాలలను రక్షించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో సంబందితశాఖల అధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిషన్‌ వాత్సాల్య కార్యక్రమం కింద బాల్య వివాహల నిషేధిత చట్టం పోక్సో చట్టాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. బాల్య వివాహల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామ, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి సర్పంచ్‌, స్వయం సహయక సంఘాల మహిళలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. అనంతరం మన అంగన్‌వాడీ మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా పోషణ మాసంపై సమీక్షించారు. ఈనెల 9 నుంచి వచ్చే నెల 8 వరకు అన్నిఅంగన్‌వాడీ కేంద్రాలలో పోషణ మాసం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని అదేశించారు. అనంతరం పోషణ మాసంకు సంబందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీడబ్లువో స్వరూపరాణి, డీపీవో భిక్షపతి, డీఈవో సచ్చిదానందచారి, డీసీపీవో మహేష్‌, డీఐఈవో రాందాస్‌, ఐసీడీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 15 , 2026 | 11:18 PM